G-N7RFQXDVV7 ఇక పై బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలంటే తెలుగు హీరోలకు దడ

Ticker

6/recent/ticker-posts

ఇక పై బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలంటే తెలుగు హీరోలకు దడ

 



టాలీవుడ్ సూపర్ స్టార్ మమేష్ బాబు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ నుంచి నోటీసులు అందుకున్నారు. గతంలో ఆయన సునానా గ్రూప్ మరియు సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు  బ్రాండ్ అంబాసిటర్ గా పనిచేశారు. ఆ వ్యవహారంలోనే ఈ నోటీసులు జారీ అయ్యాయని తెలిసింది. మహేష్ బాబు ఏప్రిల్ 27న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో వున్న సమాచారం వున్నట్టు చెబుతున్నారు. ఈ రెండు సంస్థలకు యాడ్స్ చేసినందుకు గానూ మహేష్ బాబు సుమారు 3.4 కోట్లు తీసుకున్నట్టు తెలిసింది.  రెండు సంస్థలు  యాడ్ కు పారితోషికంగా 5.9 కోట్లు ఒప్పందం కుదుర్చుకోగా అందులో 2.5 నగదు రూపంలో తీసుకున్నారనీ, మిగతాది చెక్కు రూపంలో తీసుకున్నారని సమాచారం. ఈ  రెండున్నర కోటి విషయంలోనే మహేష్ బాబుకు నోటీసులు జారీ అయ్యాయని తెలిసింది. పై రెండు సంస్థలు బ్యాంకు మోసం ఆరోపణలు, ఒకే భూమిని వేర్వేరు వ్యక్తులకు విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. అలాంటి సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిటర్ గా వుండి పెట్టుబడులు పెట్టడానికి ప్రభావం చూపించారనే అభియోగం పై కూడా ఈడీ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. దీనికి సరిగ్గా రెండు రోజుల ముందు అల్లు అర్జున్ ఒక కార్పొరేట్ కాలేజీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం వివాదంలో ఇరుక్కునేలా చేసింది. అల్లు అర్జున్  బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం వల్ల విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయని ఏ.ఐ.ఎస్. ఎఫ్ సభ్యులు  అల్లు అర్జున్ పై సంచలన ఆరోపణలు చేయడం వివాదస్పదంగా మారింది.  అంతే కాదు ఆయనను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేయడం కూడా గమనార్హం. అల్లు అర్జున్ తో పాట హీరోయిన్ శ్రీ లీల కూడా విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఆమె కూడా ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కోవడం గమనార్హం.