G-N7RFQXDVV7 టాలీవుడ్ లో చక్రి వాయిస్ ను రీ క్రియేట్ చెయ్యడంతో కొత్త గాయకుల్లో దడ

Ticker

6/recent/ticker-posts

టాలీవుడ్ లో చక్రి వాయిస్ ను రీ క్రియేట్ చెయ్యడంతో కొత్త గాయకుల్లో దడ

 


టాలీవుడ్ లో సంగీత దర్శకుడు చక్రి తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్ లో వచ్చిన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. బాచీ, ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్ చిత్రాలకు అందించిన పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో ముద్రను వేశాయి. అయితే వీడిటల్లో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే అనే పాట వేరే లెవెల్. అని అందరికీ తెలిసిందే. ఆ పాట కు రవితేజ చేసిన డాన్స్  ఆయనకు సిగ్నేచర్ గా నిలిచిపోయింది. ఇంతకూ ఈ ఇంట్రడక్షన్ ఎందుకంటే..

దాదాపు 23 ఏళ్ల తర్వాత ఇడియట్ లోని పాటను మాస్ జాతర సినిమా కోసం రవి తేజ, శ్రీ లీల మధ్య చిత్రీకరించారు. ఈ తరం యువతను ఆకట్టుకునేలా పాట లిరిక్ మార్చి రీ క్రియేట్ చేశారు. అయితే ఈ పాట కోసం చక్రి వాయిస్ ను ఏ.ఐ ద్వారా క్రియేట్ చెయ్యడంతో టాలీవుడ్ లో ఇది కొత్త ప్రయోగంగా చెప్పుకుంటున్నారు. ఈ పాట నేటి యువతకు బాగా కిక్కెక్కిస్తోంది. ఇటీవల  తు మేరీ లవర్ అనే టైటిల్ తో విడుదల చేసిన ఈ లిరికల్ వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఈ పాటకు 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యూటూబ్  మ్యూజిక్ లో నెంబర్ 2 సాంగ్ గా ట్రెండింగ్ లో నిలబడటం విశేషం. ఈ  రీ క్రియేట్ చేసిన సాంగ్ కు భీమ్స్ సంగీతం అందించగా, పూరి జగన్నాథ్ కు అత్యంత సన్నిహితుడైన భాస్కర భట్ల రవికుమార్ లిరిక్ అందించారు. ఈ చిత్రానికి భాను బోగవ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. అయితే చక్రి వాయిస్ ను ఏ.ఐ  ద్వారా జనరేట్ చెయ్యడంతో కొంత మంది సింగర్స్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. చక్రి వాయిస్ లాగానే మును ముందు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ కూడా క్రియేట్ చేస్తే కొత్త గాయకుల పరిస్థితి ఏంటి అంటూ తమ తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలుస్తోంది. ఇన్నేళ్లకు గాయకులకు అటు టీ.వి. రంగం ద్వారా, యూటూబ్ ద్వారా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏ.ఐ వల్ల గాయకుల వాయిస్ ను రీక్రియేట్ చేస్తే కొత్త గాయకుల పరిస్థితి ఏంటి? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ గా తయారు చేసే వాయిస్ కు, స్వగాత్రానికి చాలా తేడా వుంటుంది. క్రియేటర్స్ లేక పోతే మెషీన్స్ ఏం చేయలేవు అంటూ పలువురు విశ్లేషకులు ధైర్యం చెబుతున్నట్టు తెలుస్తోంది.