హీరో నితిన్ కు అర్జెంట్ గా ఇప్పుడు ఒక హిట్ కావాలి. ఎందుకంటే లేటెస్ట్ గా విడుదలైన రాబిన్ హుడ్ తో కలుపుకుంటే డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపులు సొంతం చేసుకున్న క్రెడిట్ నితిన్ కే దక్కింది. ఒక వైపు కొత్త హీరోలు, కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల్లో నితిన్ మీదున్న అభిమానాన్ని షేర్ చేేసుకుంటూ వెళుతున్నారు. అందుకే ఇప్పుడు నితిన్ కు అర్జెంట్ గా ఒక హిట్ కావాలి. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వం లో నితిన్ ’తమ్ముడు‘ అనే టైటిల్ తో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇది అక్క తమ్ముడు అనుబంధంతో వున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో కథ వుంటుంది అనే లీకు వచ్చింది. అయితే పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ’తమ్ముడు’ సినిమా కూడా అన్న తమ్ముడు అనుబంధంతో సాగే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథ కావడం విశేషం. అయితే తమ్ముడు సినిమాలో కిక్ బాక్సింగ్ అయితే ఇక్కడ ఆర్చరీ ఆటగాడుగా నితిన్ నటిస్తున్నారు. ఈ గేమ్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుందట. అందుకే ఈ మధ్య నితిన్ చాాలా హ్యాపీగా కనిపిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సరైన అప్ డేట్ లేదు. అందుకే విడుదలపైన రక రకాల పుకార్లు వస్తున్నాయి. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల అవుతుందా? వచ్చే ఏడాది రిలీజ్ కు వెళుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ చిత్రం జూలై 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Social Plugin