G-N7RFQXDVV7 బాలీవుడ్ రామాయణ్ పైన తెలుగు వాళ్లు సీరియస్

Ticker

6/recent/ticker-posts

బాలీవుడ్ రామాయణ్ పైన తెలుగు వాళ్లు సీరియస్

 


రామాయణం, మహా భారతం ఎన్ని సార్లు విన్నా, వినాలనిపిస్తూనే వుంటుంది. గతంలో రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం టి.వి. సీరియల్ ఇండియాలో ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో ప్రతి ఆదివారం  9గంటలకు రామాయణం సీరియల్ మొదలవుతోంది అనగానే టి.వి. ల ముందు టెంకాయలు కొట్టీ మరీ చూసే వారు. మన భారత దేశంలో రామాయణానికి అంతటి ప్రాముఖ్యత వుంది. అలాంటిది ప్రభాస్ హీరోగా వాల్మీకి రామాయణాన్ని తెరకెక్కించారు. కానీ అది విమర్శలపాలైంది. ఇప్పుడు దంగల్ సినిమా దర్శకుడు  నితీష్ తివారీ రామయణాన్ని అత్యంత సాంకేతిక పరిజ్నానంతో రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రరంపై తెలుగు వాళ్లు సీరియస్ గా వున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే రణ బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనున్నారు. సన్నిడియోల్ హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండగా రావణుడి పాత్రలో కేజీఎఫ్ ఫేమ్ యష్ కనిపించనున్నారు. ఫస్ట్ పార్ట్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటి వరకు రామాయణం ఇతిహాసం నేపథ్యంలో వచ్చిన సినిమాలకు బిన్నంగా ఈ సినిమా వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఆస్కార్ అందుకున్న ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయనతో పాటు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్ కూడా పాలు పంచుకుంటున్నారు. గతంలో జిమ్మర్ చాలా హాలీవుడ్ చిత్రాలకు పని చేశారు. వాటిలో ’ ద క్రియేటర్ ’, డ్యూన్ పార్ట్ 2, ముఫాసా, దిలయన్ కింగ్ వున్నాయి. దీంతో రామాయణం ఎలా వుండబోతోందో అర్థం అవుతోంది. రామాయణ పార్ట్ 1 ను దీపావళికి విడుదల చేస్తుండగా పార్ట్ 2 ను 2027 లో దీపావళికి విడుదల చేస్తాం అని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం రావణుడి పాత్ర పోషించడానికి యష్ సెట్ లో అడుగు పెడుతున్నారు.  సెంటి మెంట్ ను ఫాలో అవుతూ, ఉజ్జయినీ మహాంకాళి గుడిలో ప్రత్యేక పూజలు చేసి సెట్ లో అడుగు పెడుతున్నారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులు గుర్రుగా వున్నారు. నితీష్ తివారీ ఉద్దేశ్యపూరంగానే తెలుగు నటీ నటులను ఎంపిక చేయలేదనీ, తెలుగు దర్శకులు, తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రేపే ప్రకంపనాల మూలంగా కేవలం బాలీవుడ్ హీరోలను తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఎంపిక జరిగిందనీ చెబుతున్నారు. ఉత్తరాది వాళ్లు దక్షిణాది వాళ్లను రావణ సంతతిగా చూస్తారు. అందుకే రావణుడి పాత్రకు యష్ ను ఎంపిక చేశారు. సన్నిడియోల్ హనుమంతుడి పాత్రకు ఎలా సరిపోతారు అంటూ తెలుగు నటీనటులు మండిపడుతున్నట్టు సమాచారం.