పరిస్థితులు చూస్తుంటే రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛైంజర్ ప్లాప్ తర్వాత శంకర్ ను కోలీవుడ్ కేర్ చెయ్యటం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కప్పుడు శంకర్ అంటే ఒక రేంజ్. ఆయన రూపొందించిన జెంటిల్ మేన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో ఇలా ప్రతి సినిమా ఇండియన్ సినిమా రికార్డులు బ్రేక్ చేసినవే. వరుసగా ప్లాప్ లతో శంకర్ పరిస్థితి కోలీవుడ్ లో దారుణంగా మారినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే గేమ్ ఛైంజర్ సినిమాకు కథను తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించారు. అయితే ఇటీవల సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా వేడుకలో కార్తీక్ సుబ్బరాజు చేసిన కామెంట్స్ చూస్తుంటే శంకర్ కు తమిళనాట ఎంత విలువ వుందో అర్థం అవుతోంది. గ్లోబల్ స్టార్ గా తెలుగు ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకుంటున్న రామ్ చరణ్ హీరోగా శంకర్ అలాంటి సినిమా ఎలా తీశారు అని రామ్ చరణ్ తో పాటు ఆయన అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే టాప్ డైరెక్టర్ శంకర్ అనగానే భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. కథ ను ప్రతి కోణంలోనూ సూక్ష్మంగా పరిశీలించే శంకర్ ఎందుకు ఆ కథను సెలెక్ట్ చేశారు అనే అనుమానాలు అందరికీ వున్నాయి. ఒక వేళ శంకర్ ఓకే చేసినా, అలాంటి కథను రామ్ చరణ్, దిల్ రాజు ఎలా ఒప్పుకున్నారు? రామ్ చరణ్ ముందు కథ వినలేదా అని క్రిటిక్స్ రాశారు. అయితే ఇక్కడే వుంది తిరకాసు. శంకర్ మొదట కథ చెప్పిన తర్వాత ఎవ్వరూ ఆ కథ లో ఇన్వాల్వ్ కాకూడదు అని అగ్రిమెంట్ లో మెన్షన్ చేస్తారు. దీనిపై ఆ మధ్య కూడా కొంత మంది నిర్మాతలతో చిన్న పాటి మనస్వర్థలు వచ్చాయి. తమిళనాట ఇది తెలిసే శంకర్ ను ప్రొడ్యూస్ చెయ్యడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో దిల్ రాజు తెలుగు సినిమాకు తీసుకువచ్చారు అని తమిళ తంబిలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే కార్తీక్ సుబ్బరాజు ఏమన్నారు అనే విషయానికి వస్తే, కార్తీక్ సుబ్బరాజు సపరేట్ గు ఒక ప్రెస్ తో మాట్లాడుతూ నేనిచ్చిన కథ సూపర్ గా వుంటుంది. శంకర్ మరి కొంతమంది దర్శకులతో కూర్చొని ఆ కథను కలగూర గంపలా మార్చేశారు. నా కథలో వున్న ఫ్లేవర్ నాకు ఎక్కడా కనిపించలేదు. అందులో నా తప్పేం లేదు. తప్పంతా శంకర్ దే అంటూ బాంబు పేల్చారు. దీంతో అటు తమిళ పరిశ్రమలోనూ, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ శంకర్ మీదున్న ఇమేజ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టయ్యింది. కార్తీక్ సుబ్బరాజు కామెంట్లపైన శంకర్ ఏమైనా రియాక్ట్ అవుతారేమో వేచి చూడాల్సిందే.
Social Plugin