G-N7RFQXDVV7 దేవ కట్టా ను సోషల్ మీడియా హంటింగ్

Ticker

6/recent/ticker-posts

దేవ కట్టా ను సోషల్ మీడియా హంటింగ్

 




దేవా కట్టా రిపబ్లిక్ సినిమా తర్వాత కనిపించలేదు. ఇంత వరకు ఏ ప్రాజెక్టు ప్రకటించకపోవడంతో సోషల్ మీడియాలో దేవ కట్టాను అడిగినట్టున్నా రు. అందుకే  దేవా కట్టా తన ప్రాజెక్టుల గురించి ఓ ట్వీట్ వేశాడు.

 ప్రస్తుతం మయసభ మొదటి సీజన్ పనుల్లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే 400 నిమిషాల పుటేజ్ సిద్దమైందిఅంటున్నాడు. అంటే దగ్గరదగ్గరగా మొదటి సీజన్ ఏడు గంటల నిడివి ఉంటుందని అర్థం అవుతోంది. వెబ్ సిరీస్ కాబట్టి దీనికి ఓ లిమిట్ గానీ, నిడివి ఇంత ఉండాలనే సమస్య గానీ ఉండదు. ఎంగేజింగ్‌గా ఉంటే పది గంటలు లేవకుండా అయినా కూర్చుని చూస్తారు ఆడియెన్స్.

ఈ వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా ఇంకో సినిమాకు స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నాడట. తనకు ఇష్టమైన యాక్టర్, స్టార్‌తో ఆ సినిమా ఉంటుందని హింట్ ఇచ్చాడు. కానీ ఆ స్టార్ హీరో, యాక్టర్ ఎవరు అన్నది మాత్రం రివీల్ చేయలేదు. చూస్తుంటే మళ్లీ సాయి ధరమ్ తేజ్‌తోనే సినిమా చేస్తాడా? లేదంటే శర్వానంద్ సినిమా తీస్తాడా? అన్నది చూడాలి.