పవన్ కల్యాణ్ కొద్ది రోజులు తన ద్రుష్టి సినిమాల మీద పెట్టినట్టు తెలుస్తోంది. హరి హరి వీరమల్లు, ఓజీ చిత్రాలను త్వరలోనే పూర్తి చేసి వస్తాద్ భగత్ సింగ్ కూడా లైన్ లోకి తీసుకురావాలని చూస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికి వరకు రాజకీయాల్లో పడి ఈ సినిమాలను గాలికి వదిలేసినా వీటిని ముందు కంప్లీట్ చెయ్యాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే వీర మల్లు సినిమా ను మే 9న పక్కాగా విడుదల చేస్తాం అని నిర్మాతలు చెబుతున్నారు. కానీ దానికి సంబంధించిన ప్రమోషన్ ఇంకా స్టార్ట్ కాకపోవడంతో అటు డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో కూడా డైలమా వుంది. కానీ నిర్మాతల కాన్ఫిడెన్స్ చూస్తుంటే హరి హర వీరమల్లు మే 9న రావడం ఖాయం అనిపిస్తోంది. ఇక ఓజి చిత్రానికి వస్తే దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ లో విడుదల చేయాలని పవన్ గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టు ఆ సినిమాకు డేట్లు కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు సరే మరి హరిష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ మాటేమిటి? అంటే దానికి కూడా పవన్ కల్యాణ్ రంగం సిద్ధం చేశారు అంటున్నారు. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి పవన్ కల్యాణ్ రాజకీయ బిజీతో దీని గురించి ఆలోచించనే లేదు. అందుకే హరీష్ శంకర్ ఇతర స్టార్లతో కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ సినిమాను కూడా లైన్లో పెట్టమని పవన్ కల్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది. జూలై లోపు ఓజీ పూర్తి చేసుకొని పవన్ కల్యాణ్ ఖాళీ అయిపోతారని, ఆ తర్వాత భగత్ సింగ్ సినిమాకే డేట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. అదే గనుక జరిగితే హరీష్ శంకర్ పంట పండినట్లే. ఈ మధ్య హరీష్ కు హిట్లు కూడా పెద్దగా లేవు. పవన్ కల్యాణ్ తో సినిమా సక్సెస్ కొడితే మళ్లీ స్టార్ హీరోలు టచ్ లోకి వస్తారని హరీష్ భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
Social Plugin