G-N7RFQXDVV7 రాజమౌళి కథ ను బాలీవుడ్ లో హైజాక్

Ticker

6/recent/ticker-posts

రాజమౌళి కథ ను బాలీవుడ్ లో హైజాక్

 

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం అని ఎన్నో ఇంటర్వూల్లో చెప్పారు. బాహుబలి సినిమా ప్లాట్ కూడా ఒక రకంగా మహాభారతాన్ని పోలి వుంటుందనే రివ్యూస్ కూడా వచ్చాయి. బాహుబలి సినిమాతో తాను మహాభారతం తీస్తే ఎలా వుంటుందో, రెండు పార్టలలో రాజమౌళి చూచాయిగా చూపించేశారు. రాజమౌళి ఇంటర్వూలలో మహా భారతం నా డ్రీమ్ ప్రాజెక్టు దాన్ని ఐదు భాగాలుగా చిత్రీకరిస్తాను దీనికి సంబంధించిన ప్లాన్లు కూడా సిద్ధం అవుతున్నాయి. అదే నా ఆఖరి సినిమా అవుతుంది అంటూ చాలా ఇంటర్వూలలో చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన డ్రీమ్ ప్రాజెక్టు హైజాక్ అయ్యినట్టు తెలుస్తోంది. తాజాగా అమీర్ ఖాన్ ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ తన ప్రొడక్షన్ లో మహా భారతం ఆధారంగా ఒక సినిమా రాబోతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పలు భాగాలుగా తెరకెక్కుతోందని, దీనిపై పలువురు దర్శకులు పని చేస్తున్నారని చెప్పారు. అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థ కూడా ఆషా మాషి సంస్థ కాదు. ఆయనకు కూడా సినిమాల మీద ప్రేమ ఎక్కువే. ఎందుకంటే చివర్లో ఆయన నటించిన సినిమాలను చూస్తే చాలు, సినిమాల మీద అవగాహన అర్థం అవుతుంది. అలాంటిది అమీర్ ఖాన్ కన్ను కూడా మహాభారతం మీద పడింది అంటే మంచి విలువలతోనే తెరకెక్కిస్తారు. అందులో డౌటేం లేదు. మరి రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టును వదులుకుంటారా? అనేది ఇప్పుడు చర్చగా కొనసాగుతోంది. దీని మీద పలువురు విశ్లేషకులు పలు విధాలుగా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ’ మహాభారతం అనేది ఒక మహా సముద్రం. ఆ కథను ఎవరు ఎన్ని విధాలుగా తీసినా మరో కొత్త కోణంలో చూపించవచ్చు. రాజమౌళికి వేరే ఆలోచన వుంటుంది. అందుకే తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి అంత ఓపెన్ గా ఇంటర్వూల్లో చెప్పేశారు. ఎమోషన్స్ పండించడం, యాక్షన్ సీక్వెన్స్ రూపొందించడంలో రాజమౌళిని ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడిగా చెప్పుకోవచ్చు. రాజమౌళి కోణంలో అమీర్ ఖాన్ ఆలోచించకపోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి మునుముందు ఏం జరుగుతుందో. రాజమౌళి తను మహాభారతం సినిమా తీస్తే దాన్ని మించింది ఇంకొకటి వుండదు. రాజమౌళి కాన్పిడెన్స్ అంతలా వుంటుంది అని సన్నిహితులు చెబుతున్నారు.