తెలుగు దర్శకుల్లో రాజమౌళి ఒక ఆణిముత్యం. తెలుగు సినిమాను ఆస్కార్ మెట్లు ఎక్కించిన మొట్ట మొదటి డైరెక్టర్. ఆయన దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా ప్లాప్ టాక్ అందుకోలేదు. ప్రేక్షకుల అంచనాలను ముందే ఎక్స్ పెక్ట్ చేసి అంతకు మించి మసాలను అందిస్తూ మొదటి సినిమా నుంచి అలరిస్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు రాజమౌళి ప్రొఫైల్ లో ఇంకో అంశం చేరింది. అది ఏంటంటే ఇప్పుడు ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా ప్రముఖ సినీ డేటా బేస్ IMDB వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం రాజమౌళి ఒక సినిమా కోసం తీసుకునే రెమ్యునరేషన్ దాదాపు 200 కోట్లు అని తెలియజేసింది. అయితే ఇందులో రాజమౌళి రెమ్యునరేషన్ తో పాటు ఆయన సినిమాలో వచ్చే లాభాలలో తన వాటాతో కలిపి అని స్పష్టంగా తెలియజేసింది. అంటే ఆయన రెమ్యునరేషన్ ప్లస్ సినిమాలో వచ్చే లాభంలో వాటా అన్న మాట. ఇప్పుడు మహేష్ బాబుతో తీసే సినిమా పెద్ద హిట్ అయితే ఆయన రెమ్యునరేషన్ ఇంకా పెరుగుతుంది. రాజమౌళినే రెమ్యునరేషన్ పరంగా ఇండియాలో తోపు అని మనం మాట్లాడుతుంటే IMDB మరో విషయాన్ని కూడా వెల్లించింది. అదేంటంటే పుష్ఫ సీక్వెన్స్ డైరెక్టర్ సుకుమార్ కూడా పుష్ఫ2 సినిమా కోసం తన రెమ్యునరేషన్ 200 కోట్లు తీసుకున్నట్టు నివేదిక వెల్లడించింది. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిందని అంచనా. దాంతో సుకుమార్ రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటను కలిపితే దాదాపు 200 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు అవుతుందని IMDB నివేదిక వెల్లడించింది. గణాంకాల ప్రకారం చూస్తే రాజమౌళి కంటే ముందే సుకుమార్ 200 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. ఇక IMDB వీళ్లిద్దరి తర్వాత అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా ఒకొక్కరు 90 కోట్ల వరకు తీసుకుంటున్నారు. రాజ్ కుమార్ హిరానీ రెమ్యునరేషన్ 80 కోట్ల దాకా వుంటుందని నివేదిక స్పష్టం చేసింది. పుష్ప 2 సక్సెస్ ద్వారా మార్కెట్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లిన సుకుమార్, ఈ సారి పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అదే గనక జరిగితే ఆయన రెమ్యునరేషన్ ఇంకా పెరిగే ఛాన్స్ వుంటుంది.
Social Plugin