ఊర్వశి రౌటేలా ఒక ఇంటర్వూలో మాట్లాడిన మాటలు వింటుంటే ఆశ్యర్చమవుతుంది. ఒక సెలబ్రిటీ హోదాలో వున్న ఆమె ఇలాంటి అబద్దాలు చెప్పటం వల్ల తన ఇమేజ్ ఏమై పోతుంది అనే చిన్న సెన్స్ కూడా వుండదా అనిపిస్తుంది. అసలు విషయం ఏంటంటే ఊర్వశి రైటేలా కు బద్రీనాథ్ టెంపుల్ పక్కన ఒ గుడి కట్టారని ఆమె చేసిన కామెంట్స్ దుమారం లేపాయి. ఉత్తరాఖాండ్ అర్చకులైతే ఎదురుపడితే చెంపలు వాయించేలా వున్నారు.
. ఊర్వశీ వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ అర్చకులు మండిపడుతున్నారు. అసలు ఆమె ఇంటర్వూలో ఏం చెప్పిందంటే
''నార్త్ ఇండియాలో నా పేరు మీద ఊర్వశి టెంపుల్ ఉంది. బద్రీనాథ్‌కు ఒక కిలోమీటర్ దూరంలో ఆ గుడి ఉంది. అది నాకోసమే కట్టారు. సౌత్ లో చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణలతో కలిసి నటించాను. కాబట్టి వాళ్ల అభిమానులు అక్కడ కూడా రెండో గుడిని నిర్మించాలని కోరుకుంటున్నాను'' అని తెలిపింది. ఊర్వశీ చేసిన వ్యాఖ్యలపై అక్కడి పూజారులు ఫైర్ అయ్యారు. అది ఆమె గుడి కాదని, అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని, ఇలా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బద్రినాథ్ సమీపంలో ఊర్వశీ పేరుతో గుడి వున్న మాట వాస్తవమే కానీ ఆ టెంపుల్ కు, ఊర్వశీకి ఎలాంటి సంబంధం లేదు. అని స్థానిక పూజారి భువన్ చంద్ర ఉనియాల్ చెప్పారు. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం ఊర్వశీ దేవి గుడిగా మారిందని చెప్పారు. సతీదేవికి సంబంధించిన ఆలయంగా 106 శక్తి పీఠాల్లో ఒకటిగా ఇక్కడి ప్రజలు దేవతను కొలుస్తారు అని వివరణ ఇచ్చారు. ఊర్వశి పైన బ్రహ్మ కపాల్ తీర్థ్ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ కూడా ఫైర్ అయ్యారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Social Plugin