దేవ కట్టా డైరెక్షన్ లో వస్తున్న మయసభ సినిమాలో సాయి కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన కలిసిన ప్రతీ సారి ఈ మయసభ గురించి చెబుతూనే ఉన్నాడు. ఈ వెబ్ సిరీస్‌లో తన పాత్ర అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. అసలే ఈ మధ్య సాయి కుమార్ నటిస్తే చాలు సినిమా బ్లాక్ బస్టర్ అన్నట్టుగా మారిపోయింది. లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, కమిటీ కుర్రోళ్లు ఇలా చాలా చిత్రాలు కమర్షియల్‌గా హిట్ల మీద హిట్లు అవుతున్నాయి. ప్రస్థానం రేంజ్‌లో ఈ మయసభ వెబ్ సిరీస్ సాయి కుమార్‌కు పేరు తెచ్చి పెడుతుందా? లేదా? అన్నది త్వరలోనే తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ వెబ్ సిరీస్ ఆడియెన్స్ ముందుకు వస్తుందని సమాచారం.
Social Plugin