G-N7RFQXDVV7 విశ్వంభర గ్రాఫిక్స్ కే 75 కోట్లు

Ticker

6/recent/ticker-posts

విశ్వంభర గ్రాఫిక్స్ కే 75 కోట్లు

 


మెగాస్టార్ విశంభర చిత్రం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఈ సినిమా కోసం చిరంజీవి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో దర్శకుడు మల్లిడి వశిష్ట బింబిసారి సినిమాను సోషియో ఫాంటసీగా చిత్రీకరించి హిట్ సాధించారు. అంతే కాకుండా ఆయన కథ అల్లిన తీరు, అందులో కామెడీ మిక్స్ చేసిన తీరు చాలా బాగుంది అంటూ అప్పట్లో పొగడ్తలు వచ్చాయి. ఈ సినిమా  కూడా అలాంటి కథాంశంతోనే వస్తోంది కాబట్టి అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇక మెగాస్టార్ సోషియో ఫాంటసీ సినిమాల్లో నటించి చాలా కాలం అయ్యింది. జగదేక వీరుడు అతిలోక సుందరి  సినిమాలో మెగాస్టార్ నటన ఇప్పటికీ గుర్తుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను నిర్మాతలు విడుదల చేయడంతో సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి. యూటూబ్ లో గ్లింప్స్ కింద ‘మేము అన్నయ్య నుంచి ఎక్స్ పెక్ట్ చేస్తున్నది ఇది కాదు అంతకు మించి అంటూ కామెంట్లు పెట్టారు. ఇవి మేకర్స్ ద్రుష్టికి వెళ్లి ఇప్పుడు గ్రాఫిక్స్ ను వేరే లెవెల్లో రూపొందించాలని  దాని మీద శ్రద్ద పెట్టారని తెలుస్తోంది. ఇందుకు గాను ఏకంగా 75 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.  దీని కోసం హాలీవుడ్ నిపుణుల బ్రుందాన్ని కూడా సంప్రదించారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రేక్షకుడు రాజమౌళి గ్రాఫిక్స్, పుష్ప, కల్కి, దేవర లాంటి గ్రాఫిక్స్ చూసి అంచనాలు పెంచుకొని వున్నారు. వీటి రేంజ్ కు ఏ మాత్రం తగ్గినా ప్రేక్షకులు పెదవి విరిచే అవకాశం వుంది. ఈ సినిమా జనవరిలోనే సంక్రాంతికి విడుదల కావలసి వుండేది. కానీ  కొన్ని కారణాల వల్ల మేకర్స్ విడుదలను వాయిదా వేశారు. ిప్పుడు ఈ మూవీని జూలై 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ డేట్ కు ఒక స్పెషాలిటీ వుంది. అదే రోజు బ్లాక్ బస్టర్ చిత్రం ఇంద్ర విడుదలైంది. కాబట్టి మేకర్స్ కూడా ఇదే తేదీని ఎంచుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక సినిమా విషయానికొస్తే.. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న విశ్వంభరలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్, వంశీ, విక్రమ్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.