తమన్నా భాటియా మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఓదెల 2 చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇక్కడే వుంది అసలు తిరకాసు. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.25 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది అనేది ఆ పోస్టర్ ఉద్దేశ్యం. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులు తెలివి మీరి పోయారు. ఓదెల సినిమాను ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు 8 కోట్ల దాకా బిజినెస్ చేసినట్టు డిస్టిబ్యూటర్లు చెప్పుకుంటున్నారు. అందులో కోటి డెబ్భై ఐదు లక్షలకు నైజాం ఏరియా హక్కులను దిల్ రాజు కంపెనీ పొందగా, సీడెడ్ ఏరియాకు కోటి ఇరవై ఐదు లక్షలకు అమ్మినట్టు తెలిసింది. అంటే మిగతా మొత్తం ఆంధ్ర బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాల బోగట్టా. ఇలా తీసుకుంటే ఓదెల సినిమా హిట్ అయ్యి పంపిణీ దారులకు డబ్బు మిగలాలి అంటే దాదాపు 20 కోట్లు కలెక్ట్ చేయాల్సి వుంటుంది. ఎందుకంటే అందులో టాక్స్ లు, క్యూబ్ లు , పబ్లిసటీ ఖర్చులు ఇవన్నీ తీసి వేస్తే తప్ప 8 కోట్లు నెట్ రాదు. అలాంటిది పోస్టర్ లో మూడు రోజులకు 6.25 కోట్ల గ్రాస్ అని ఇస్తే ప్రేక్షకులు ఎలా టెమ్ట్ అయ్యి సినిమా థియేటర్లకు పరిగెత్తుకుంటూ వస్తారు అని కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నిస్తున్నారు. సినిమా సీన్లపైన, టాక్ పైన పబ్లిసిటీ చేసుకోవాలి తప్ప ఇలా కలెక్షన్ల కు, ప్రేక్షకులకు సంబంధమేంటి? అని ప్రశ్నిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఓదెల హక్కలను కొన్న వ్యక్తి ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్ చూశాక, కలెక్షన్లు పెద్దగా లేవని భావించి తను కమిట్ అయిన 7 కోట్ల డెభ్బై ఐదు లక్షలు కట్టడానికి నిరాకరించారనీ, ఆ పంచాయితీ పొద్దున వరకు జరిగిందనీ, అందుకే కొన్ని ఏరియాల్లో మార్నింగ్ షో పడలేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు సినిమా కొన్న డిస్టిబ్యూటర్లకు కేవలం ఇరవై నుంచి ఇరవై రెండు శాతం మాత్రమే అమౌంట్ కవర్ అవుతుందని, మిగతాదంతా లాస్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఏది ఏమైనా సినిమా పబ్లిసిటీ అనేది మంచి సీన్లను ప్రమోట్ చేసి ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడానికి చేసేలా వుండాలి కానీ, కలెక్షన్లు చూపించి కాదు అనే వాదన వినిపిస్తోంది.
Social Plugin