G-N7RFQXDVV7 జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత

Ticker

6/recent/ticker-posts

జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత




 ఓటీటీలు వచ్చినా, పైరసీలు వచ్చినా థియేటర్ లో సినిమాలు చూస్తే ఆ ఫీలింగే వేరు. దాదాపు నలభై శాతం మందికి ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చినా, హాలిడేస్ వచ్చినా, పండుగ సమయాల్లో ఒక సినిమా థియేటర్ లో చూస్తే ఆ కిక్కే వేరు. కానీ ఒక ఫ్యామిలీ థియేటర్ కు వెళ్లాలంటే ఇప్పుడు దాదాపు 3 నుంచి 4 వేలు ఖర్చువుతుంది. కాబట్టి ఆ సినిమాల్లో కంటెంట్ వుండి ఎంజాయ్ చేసేలా వుంటేనే ఫ్యామిలీ ఆ సినిమాకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. లేదంటే ఒక వారం ఆగుదాం ఓటీటీకి వస్తుందిలే అని ఎదురు చూస్తున్నారు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ బిజినెస్ చాలా తగ్గిందనే చెప్పాలి. ఒక మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్ కు కలెక్షన్ తో పాటు, క్యాంటిన్ ద్వారా, సైకిల్ స్టాండ్ ద్వారా వచ్చే లాభం కూడా ఎక్కువే వుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఆదాయం పోయిందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. కలెక్షన్లు బాగా వస్తాయి అని ఎక్స్ పెక్ట్ చేసే పెద్ద సినిమాలను థియేటర్ లో రెంట్లకు వేసుకుంటున్నారు. చిన్న చితక సినిమాలను పర్సెంటేజ్ కు వేసుకుంటున్నారు. దీని వల్ల థియేటర్ బిజినెస్ బాగా పడిపోయింది. అలా కాకుండా చిన్నా,  స్టార్లు నటించిన పెద్ద సినిమాలు కూడా పర్సెంటేజ్ పద్దతిలోనే వేసుకోవాలి. అప్పుడే థియేటర్లను కాపాడిన వాళ్లు అవుతారు. డిస్ట్రిబ్యూటర్ల లాభాలను మాకు కొంచెం పంచండి అంటూ థియేటర్ యజమానులు వాదిస్తున్నారు. ఆ వాదన కాస్త ముదిరి ఇప్పుడు థియేటర్లు మూసే వరకు వచ్చింది. వివరాల్లోకి వెళితే  తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్లు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లతో జరిపిన సంప్రదింపులు ఫలితం చూపించక పోవడంతో జూన్ 1 నుంచి థియేటర్లను మూసి వేయాలని తూర్పు గోదావరి థియేటర్ యాజమాన్యం అల్టిమేటం జారీ చేశారు. అన్ని సినిమాలకు పర్సెంటేజ్ పద్దతే వుండాలనేది వాళ్ల డిమాండ్. అయితే వారి డిమాండ్ లో కూడా న్యాయం వుంది. తమిళనాడు, కేరళలో థియేటర్లు పర్సెంటేజ్ పద్దతిలోనే బిజినెస్ జరుగుతుంది. ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్లు అదే పద్దతిని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నారు. అలా కాని పక్షంలో థియేటర్లు మూసివేస్తామని గట్టి గా చెప్పినట్లు తెలిసింది.