G-N7RFQXDVV7 లైగర్ 80 కోట్లు థియేటర్స్ నుంచి రికవరీ చేస్తుందా ?

Ticker

6/recent/ticker-posts

లైగర్ 80 కోట్లు థియేటర్స్ నుంచి రికవరీ చేస్తుందా ?



 లైగర్ సినిమా తెలుగు రాష్ట్రాలలో 70 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేస్తున్నారని తెలిసింది. ఆంధ్రా అంతా ముప్ఫై కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని, బిజినెస్ మంచి ఊపు మీద వుందని ఫిల్మ్ నగర్ టాక్. వైజాగ్ ఏరియాను కొరటాల శివ సన్నిహితుడు సుధాకర్ ముప్ఫై కోట్ల రేంజ్ లో క్లోజ్ చేశారని, అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్  భరత్ చౌదరి కూడా అదే రేంజ్ లో తీసుకున్నారని మిగిలిన ఏరియాలు హాట్ హాట్ గా డిస్కషన్ లో వున్నాయని ఆర్.పి. రోడ్ లో టాక్ నడుస్తోంది. కాగా ఈ సినిమా దక్షిణాది అంటే నాలుగు రాష్ట్రాల  హక్కులన్నింటిని కలిపి 70 కోట్ల దాకా వరంగల్ శీను తీసుకున్నారని, అయితే మరో పది కోట్లు రికవరీ అడ్వాన్స్ గా ఇవ్వాలని పూరీ జగన్నాథ్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ తో బిజినెస్ ఊపందుకుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ సినిమాను కేజీఎఫ్, పుష్ప సినిమాల రేంజ్ లో బిజినెస్ చేస్తున్నారు. సినిమా అటు, ఇటు అయినా విజయ్ దేవరకొండ ఇమేజ్ మూడు రోజుల పాటు కలెక్షన్ తీసుకురాగలదా? అనే సంశయం కూడా ఆర్ .పి రోడ్ లో వ్యక్తమవుతోంది. మరో వైపు ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ 66 కోట్లు, . కేవలం ఓటీటీ రైట్సే 55 కోట్లకు కు డిస్నీ హాట్ స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఏది ఏమైనా పూరి దర్శకత్వం వహించిన తొలి పాన్ ఇండియా మూవీ హిందీ బిజినెస్ క్లోజ్ చేసుకొని తెలుగులో కూడా హాట్ హాట్ బిజినెస్ జరుగుతుండటం గుడ్ సైన్ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.