నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమా విడుదలకు ఎప్పుడో సిద్ధమైంది. కానీ ఏదేదో కారణాల వల్ల అలా వుండిపోయిందంతే. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూలై రెండో వారంలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఒక వార్త ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. దిల్ రాజు థ్యాంక్యూ సినిమాను థియేటర్ లో విడుదల చేయకుండా ఓటీటీకి ఇచ్చేయాలని వున్నాడు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిసింది. ఒక ఆసక్తికరమైన కథాంశాలతో, మనం, 24 లాంటి సినిమాలు నిర్మించిన విక్రమ్ కే కుమార్ ఈ చిత్రాన్ని ఇంట్రస్టింగ్ కథతో తెరకెక్కించిన కథే ఇది. కానీ దిల్ రాజు ఓటీటీకి ఇస్తున్నారంటూ పుకార్లు ఎందుకు వచ్చాయి అని ఆరా తీస్తే... గతంలో కోవిడ్ టైం లో వచ్చిన డిస్కషన్ అది అనీ... కానీ ఇప్పుడు థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ వుంది. టికెట్ రేట్లు కూడా అనుకూలంగా వున్నాయి కాబట్టి ఇప్పుడు థియేటర్ పైనే దిల్ రాజు ద్రుష్టి పెట్టారని తెలుస్తోంది. ఇక కథ విషయానికి వస్తే, స్వశక్తితో తన ఒక్కడినే ఎదిగాను అనుకునే ఒక కుర్రాడు ఓ సంఘటనతో మారి తనకు సహాయం చేసిన వాళ్లందరికీ థ్యాంక్యూ చెప్పుకుంటూ వచ్చే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అవికాగోర్ కీలక పాత్రలో నటిస్తోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని మారో... మారో పాట ఇప్పటికే విడుదలైంది. ఈచిత్రాన్ని జూలై రెండో వారంలో థియేటర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.
Social Plugin