స్క్రీన్ ప్లేకు సంబంధించి దర్శకునికి చక్కటి అవగాహన అవసరం.స్క్రిప్ట్ పూర్తయ్యింది అనిపించగానే ప్రతి దర్శకుడు కింది విషయాలను ఒకసారి సరిచూసుకోవలసి వుంటుంది.
కథలో కథానాయకుడి పాత్ర, ఆ పాత్రకు నిర్దేశించిన అంశాలు, ఖచ్చితంగా వున్నాయా?
అవి కథలోని డ్రామాకు బలాన్ని చేకూర్చుతున్నాయా? లేదా? కథలో ముఖ్యాంశమేంటి?
. 3 సినిమాలో ఏ సన్నివేశం ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది అనే అంశాన్ని గుర్తించాలి.
4. సినిమా పర్టికులర్ పాయింట్ తోనే ఎందుకు ప్రారంభం కావాలి?
5 . పాత్రల చుట్టూ వున్న పరిసర వాతావరణం కరెక్ట్ గా వుందా? అది కథలోని పాత్రలకు ఉత్తేజాన్ని కలిగిస్తుందా?
6. పాత్రల గమనం ఎలా వుంది? పాత్రల గమనం ప్రేక్షకుడిలో ఆసక్తి కలిగిస్తుందా?
7. కథలోని భావోద్వేగాలు సరైన మోతాదులో వున్నాయా?
8. కథలో ప్రతి పాత్ర అవసరమైందేనా? లేక అనవసరమైన పాత్రలు ఏమైనా వున్నాయా?
9. పాత్ర ప్రవర్తన ఎలా వుంది?
10. మానసికంగా వుంటుందా? నాటకీయంగా వుంటుందా? లేక ఆద్యాత్మికమైనదా? పాత్రకేమైనా అడ్డంకులు ఎదురైనాయా?
11 పాత్రల మధ్య కేవలం మాటలే వుంటాయా? లేక మాటల యుద్ధం జరుగుతుందా?
12 మీ పాత్రల పనితీరు ఎలా వుంటుంది ? అవి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుండాలా? అవసరం లేదా? 13. మీ సినిమా మంచి స్వరంతో ఆరంభమైందా?
14. మీ సినిమాలో పాత్రలు ప్రారంభమౌతుంటాయా? లేక వెళ్లిపోతుంటాయా?
15. మీ కథలో సస్పెన్స్ ను మెయిటైన్ చేస్తున్నారా? అందులో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అవుతున్నారా? తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగిస్తున్నారా?
16 ఎక్కువ లోకేషన్లలో చిత్రీకరణ చేయబోతున్నారా ? రొమాన్స్, సస్పెన్స్, సూపర్ నేచురల్ అంశాలు సినిమాలో ఉన్నాయా? అనేది బేరీజు వేసుకుంటూ వుండాలి.
ప్రేక్షకులకు మీ సినిమాలో ఏదో జరగబోతుంది అనే విషయాన్ని ముందుగానే తెలియజేయాలి. దాని వల్ల ప్రేక్షకుడు ఆ విషయానికి అలవాటు పడే అవకాశం వుంటుంది. కథలో భావోద్వేగాలు, 17 17 కెమెరా యూ టర్న్ తీసుకోవడాలు ఉండవని తెలియచేస్తారా?
18 ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నారా?
19. ఫలితాన్ని ఎక్స్ పెక్ట్ చేయడం లేక ఎక్స్ పెక్ట్ చేసిన ఫలితం వుండకపోవడం లాంటి విషయాల్ని తెలియజేసారా?
20 ప్రతి సనివేశాన్ని వివరించేటప్పుడు ఆసక్తిని రేకిత్తించారా?
21 ప్రతి క్షణం నిజమైందా? ఒక వేళ కాకపోతే అందుకు కారణమేంటి?
22. అనుకున్న విషయాన్ని తెరకెక్కించేటప్పుడు పాత్రల మధ్య జరిగిన ప్రతి విషయం ప్రేక్షకులకి అర్థమవుతుందా?
23. మీ పాత్రలు మానవతా విలువల్ని ప్రతిబింభిస్తున్నాయా? (ఇడియోసింక్రాటిక్ బిహేవియర్ - అంటే కేరెక్టర్ కు ఉండకూడని లక్షణాలు జనాలకు అనాసక్తిని కలిగిస్తాయి)
24. ఫిల్మ్ ఇమేజ్ పవర్ ను లెక్కేశారా? దీనివల్ల షాట్ ఏం చెప్తుంది అనేది తెలుస్తుంది. ఒకవేళ ఏమీ చెప్పనట్లయితే ఊరికే చూడాల్నా అనే విషయంకూడా బోధపడుతుంది. ఫాస్ట్, స్లో, లైట్, డార్క్ బిగ్గరగా, మెల్లిగా వంటి వాటివల్ల అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించారా?
25. మీరు మొదలు పెట్టిన ప్రతిదీ, చివరి వరకు సాగేదీ ప్రయోజనకరమైనదేనా?
అనేవి లిస్ట్ తయారు చేసుకొని బేరీజు వేసుకోవాలి.
ఎవరి సినిమా ఇది?
విజయవంతమైన ఏ చిత్రాన్ని తీసుకున్నా అందులో కథానాయకుడే కీలకంగా వుంటాడు. స్క్రీన్ ప్లే పై మేము పరిశోధన చేసినపుడు మాకు ఎదురైన మొదటి ప్రశ్న మన సినిమాలో హీరో ఎవరు? అంతేకాదు పై ప్రశ్నను ఎవరి సినిమా ఇది? అని కూడా అడగవచ్చు. ఏ పాత్ర ద్వారా మనం సినిమాను వివరిస్తాం? అనేది ముఖ్యం.
హీరో అంటే సినిమా అంతటినీ ఒంటి చేత్తో యాక్షన్ సీన్స్ తో నడిపేవాడు కాదని నా అభిప్రాయం. నా అభిప్రాయం అంత చెడ్డదేం కాదు. సినిమాలో నాటకీయతలకు అతడే కీలకం. కాదనను కానీ హీరో కీలకంగా లేని సినిమాలు కూడా చాలానే వున్నాయి.
ఉదాహరణకు నోటోరియలో ఇంగ్రిడ్ బర్మన్ సృష్టించిన పాత్ర అలిసియా. అదే విధంగా చాలా సినిమాల్లో ఒకే కథానాయకుడి చుట్టూ కథ తిరగదు. రాబర్ట్ ఆల్ట్మన్స్ 'నష్ విల్లే (1975), జపనీస్ చిత్రం 'స్ట్రీట్ ఆఫ్ షేమ్' లేక వుడ్ అలెన్స్ 'హన్నా అండ్ హర్ సిస్టర్స్' వంటి సినిమాల్లో చాలా మంది నటీనటుల చుట్టూ కథ తిరుగుతుంటుంది....
పాత్ర గురించి పాల్ తను రాసిన స్టోరీ సెన్స్ పుస్తకంలో స్క్రీన్ ప్లే గురించి తెలియజేస్తూ,
'కథలు సరళంగా ఉండాలి. పాత్రలు సంక్లిష్టంగా ఉండాలి'. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. రచయిత వర్తమానంలో జీవిస్తుంటాడు. కానీ అతని పాత్రలు మాత్రం భూత కాలం నుంచి పుడతాయి. అంటే అతను గడిపిన కాలం కావచ్చు. అతన్ని ప్రభావితం చేసిన ప్యామిలీ పరిస్థితులు కావచ్చు. సామాజిక ఆర్థిక పరిస్థితులు, జీవితానుభవం... ఇలా ఏదైనా కావచ్చు. అవి కొన్ని సార్లు ప్రేక్షకుడికి కూడా బాగా కనెక్ట్ అవుతాయి. నా దృష్టిలో సినిమా అంటే ఒక రైలు ప్రయాణం లాంటిది. ప్రయాణికుడు తనకు కావాల్సిన లగేజ్ ను మాత్రమే తీసుకెళ్తాడు. ప్రతి పాత్ర దానికి తగినట్లు సిద్ధంగా ఉండాలి.
8-142లో గైడో(ఫెల్లిని, 19663), సిటీజన్ కానే లో ఛార్లెస్ ఫాస్టర్ కానే (అర్సన్, 1941), కాసబ్లాంకాలో రిక్(మైకేల్ కర్టిజ్, 1942), గాడ్ ఫాదర్, మిచెల్ (ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా, 1972) సినిమాల్లో సంక్లిష్టమైన పాత్రలు మనకు తెలుసు. -
కాజన్ ను దర్శకులకు చేతికర్రలా చెప్పుకుంటుంటారు. ఆయన "స్ట్రీట్ కార్ నేమ్ డ్ డిజైర్”లో కొన్ని తెలివైన అంశాలను ప్రతిపాదించారు. పాత్ర ఔచిత్యాన్ని తెలుసుకోవాలంటే పాత్ర గురించి లోతుగా తెలియాల్సిన అవసరం లేదు. చుట్టూ ఉన్న అంశాలను ఉరామరిగ్గా తెలుసుకున్నా పాత్ర స్వభావాన్ని " పసిగట్టవచ్చు. ఆయన దృష్టిలో పాత్రలు నటించక్కర్లేదు. జీవించాలి. అప్పుడే అవి ప్రేక్షకుడికి చేరువవుతాయి అన్నారు.. కాజన్ “నోట్ బుక్”లో వివిధ మనస్తత్వాల కలయికతో ఒక సంక్లిష్టమైన బ్లాఖే పాత్ర కనపడుతుంది. తనకు తాను నాటకీయంగా, రొమాంటిక్ గా ప్రతి సన్నివేశంలో కొత్త పాత్రను పోషించింది. బ్లాఫే 11 రకాల పాత్రలను పోషించింది. ఇది కొత్త మార్పుని, కొత్త జీవాన్ని తీసుకువచ్చింది. 'ప్రీ బెల్లవమ్ సౌత్' లో రొమాంటిక్ సంప్రదాయానికి ఈ 11 పాత్రల రొమాంటిక్, నాటకీయత వేరుగా ఉంటుంది.
కాజన్ తన ఆలోచనతో, ప్రేక్షకుల్ని వివిధ అంశాలతో ప్రభావితం చేసినట్లు ఏ దర్శకుడు ప్రభావితం చేయలేడు. ఆయన 'నోట్‌బుక్' లో బ్లాఖ్ వల్ల బాధింపబబడే పాత్ర స్టెల్లా. ఆమె గురించి చెప్పాలనుకున్న విషయాలన్నీ సాధారణ పాత్ర ద్వారా వివరించాడు. ప్రేక్షకులు నిజంగా ఆమె బాధపడుతుందేమోనన్నట్టు చూశారు. తను ఎంత బాధలో ఉన్నదీ, ఎన్ని కష్టాల్లో ఉన్నది, ఎంత
ప్రేమను పంచుతుందీ, ఎంత భయంలో ఉంది వంటి విషయాల్లో ప్రేక్షకులు ఆమె పాత్రతో పాటే ప్రయాణించారు. అసాధారణమైన మరణం ఉన్న పాత్ర, రంగులమయమైన , కొత్తగానున్న, బాధలోని, ఉహలోని ఆమె వివిధ రకాల మూర్తిమత్వాన్ని, ఆమె విషాదాన్ని ప్రేక్షకులు అనుభవించారు. కాజన్ ఒక పాత్ర భూత కాలంలో, వర్తమానకాలంలో ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనే అంశాలను సమగ్ర అధ్యయనం చేసి తెలియజేశాడు. -
పరిస్థితులు: సన్నివేశంలో పాత్ర చుట్టూ ఉన్న అంశాలనే పరిస్థితులనవచ్చు. పాత్ర దృష్ట్యా కర్త, కర్మ, నిజం లేక ఊహ కావచ్చు. ఎక్కువ నిడివి ఉన్న స్క్రీన్ ప్లేలో ప్రధాన పాత్ర పరిస్థితుల్ని స్క్రీన్ ప్లే నుండి వేరు చేసి చూడలేం.
Social Plugin