G-N7RFQXDVV7 రంగ మార్తాండ వెనుక క్రిష్ణవంశీ ప్లానేంటి?

Ticker

6/recent/ticker-posts

రంగ మార్తాండ వెనుక క్రిష్ణవంశీ ప్లానేంటి?


మరాఠీలో నానా పటేకర్ హీరోగా నటించిన నటసామ్రాట్ సినిమాను క్రిష్ణవంశీ తెలుగులో ‘రంగమార్తాండ’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను  తెలుగులో రీమేక్ చేయటం వెనుక అర్థమేంటి అని సినీ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. మరాఠిలో అవార్డు కోసం నిర్మించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు అంత అర్జెంట్ గా తెలుగులోకి రీమేక్ చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది. మరాఠిలోనే ఆ సినిమాను భరించలేకపోయారు. మరి ఇక్కడ ఎలా? అంటూ ఆలోచిస్తున్నారు. మరి కొందరు మాత్రం అందులో  నానా పటేకర్ యాక్టింగ్ సరిగ్గా చేయలేదని ప్రకాష్ రాజ్ తో చేయిస్తున్నట్టున్నారు? అంటూ సెటైర్లు వేస్తున్నారు.  పోనీ ఏదైనా అవార్డు కోసం ట్రై చేస్తున్నారా? అంటే రీమేక్ సినిమా కథకు అవార్డులు ఇవ్వరు అనే విషయం క్రిష్ణవంశీకి తెలిసే వుంటుంది. మరెందుకు? అని సినీ విశ్లేషకులు జుట్టు పీక్కుంటున్నారు. మరి కొందరు మాత్రం స్టార్ క్యాస్టింగ్ వుంది కాబట్టి ఓటీటీకి ప్లాన్ చేస్తున్నారు. ఈ కథకు బడ్జెట్ అంత ఎక్కువేం వుండదు కద అంటుంటే ఇంకొందరు మాత్రం క్రిష్ణవంశీతో మాటలు కాదు కథ ఎంత చిన్న బడ్జెట్ తో వున్న దాన్ని చేంతాడంత చేసే ట్యాలెంట్ క్రిష్ణవంశీకి వెన్నతో పెట్టిన విద్య అంటున్నారు. ఏది ఏమైనా రంగమార్తాండ విడుదలయ్యాక గానీ క్రిష్ణవంశీ ఉద్దేశ్యం బయటపడదు.



కొడుకు పోయినప్పటి నుంచి కోట కు మతి భ్రమించింది