మేడే సందర్భంగా మెగాస్టర్ కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మిస్తానని వాగ్దానం చేసిన సంగతి విదితమే. ఈ వాగ్దానాన్ని టార్గెట్ గా చేసుకొని కోట తనదైన శైలిలో మెగాస్టార్ పై విరుచుకుపడ్డారు. ‘కార్మికులకు కావలసింది కడుపునిండా తిండి ముందు ఆ పని చూడండి. చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎవరొస్తారు? కృష్ణానగర్ లో ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అంటూ నోరు పారేసుకున్నారు. దీనిపై మెగాస్టార్ అభిమానులు దాడి ప్రారంభించారు. ‘కోటకు కొడుకు పోయినప్పటి నుంచి మతి భ్రమించింది. అన్ని పనులు ఒక్కరే చెయ్యాలంటే కుదరని పని. ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ప్రభుత్వం ప్రజలకు కల్పిచాల్సిన అవసరాలు . ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన కోట మెగాస్టార్ ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము కోటకు లేదా? మెగాస్టార్ సౌమ్యుడు కాబట్టే మెగాస్టార్ మీద బురద చల్లుతున్నావా? ఆయన ఊరుకున్నా మేము చూస్తూ ఊరుకోం. అయినా టాలీవుడ్ లో ఇంతమంది హీరోలు వుంటే నీకు మెగాస్టార్ మాత్రమే కనపించాడా? ఇంట్లో కూర్చొని కృష్ణా, రామా అనుకోకుండా టి.వి. యాంకర్ అనసూయ మీద నోరు పారేసుకొని పెద్దరికాన్ని పోగొట్టుకున్నావ్. ఇప్పుడు మెగాస్టార్ ను విమర్శించి చివరి రోజుల్లో ఎందుకు పాపం ఒడిగట్టుకుంటావ్ అంటూ అభిమానులు విమర్శిస్తున్నారు.
కరోనా టైంలో ప్రతి సినీ కార్మికుడికి సహాయం అందేలా మెగాస్టార్ ముందడగు వెయ్యలేదా? కరోనా రెండో వేవ్ ముందస్తు చర్యగా ఆక్సిజన్ సిలిండర్ లు రెడీ చెయ్యలేదా? అప్పుడు లెయ్యని నోరు ఇప్పుడు లేస్తోందేం…. అంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏమైనా అంటే అన్నారంటారు గానీ… కోట మాట్లాడిని మాటలకు అర్థముందా? మెగాస్టార్ స్థాయి ఏంటి? ఆయన మరొకరికి అవకాశాలు ఇవ్వమని రెకమెండ్ చెయ్యాలా? ఇది చాలదా మతి చెలించింది అనడానికి. ఇంకా నా ఇంటికి ఎవరైనా వస్తే 500, 1000 ఇచ్చి పంపిస్తాను అని గొప్పగా చెప్పుకుంటున్నావు. నువ్వు చేసింది సాయమైతే మరి ఇంటికి రాకపోయినా ప్రతి ఇంటికి కరోనా టైంలో మెగాస్టార్ అందించిన సాయాన్ని ఏమంటారు. పనిలేకపోతే ఇంట్లో కూర్చొని రామకోటి రాసుకో అంతే గానీ మెగా తుట్టెను కదపకు అంటూ హితవు చెబుతున్నారు. ఏది ఏమైనా కోట అలా మాట్లాడటం తప్పు అని పలువురు సినీ ప్రముఖులు చెబుతున్నారు.
Social Plugin