G-N7RFQXDVV7 కన్ ప్యూజన్ లో సీనియర్ హీరోలు

Ticker

6/recent/ticker-posts

కన్ ప్యూజన్ లో సీనియర్ హీరోలు

 




సీనియర్ హీరోల సినిమాలను యువతరం ప్రేక్షకులు  కేర్ చెయ్యకపోవడంతో సీనియర్ హీరోల సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఎలాంటి సబ్జెక్ట్ ను తెరకెక్కించాలో అర్థంకాక సతమతమవుతున్నారు. ఏజ్డ్ కేరెక్టర్లు చేస్తే ఇమేజ్ ఒప్పుకోదు, కుర్ర హీరోలతో పోటీపడితే శరీరం సహకరించదు. పోనీలేద్దు మనం సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటే  మనసొప్పుకోదు. అందుకే చాలా మంది సీనియర్ హీరోలు సెక్యూరిటీ కోసం రీమేక్ సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఓటీటీల పుణ్యమా అని ఇప్పటి యూత్ ఏ ల్యాంగ్వేజ్ లో వచ్చినా వదలకుండా ఆ సినిమాలను చూసి తెలుగులో తీశాక వాటిని కంపేర్ చేసి అనాలసిస్ లతో ట్విట్టర్ లో ట్రోలింగ్ లు మొదలు పెడుతున్నారు. ఇంతకూ తమ అడుగు ఎటువైపు వేయాలి అని తికమక పడుతున్నట్టు గత రెండు భారీ సినిమాలు తేల్చి చెప్పాయి. అసలు సీనియర్ హీరోలు ఎలాంటి సినిమాలు చెయ్యాలి? అనేది విశ్లేషించుకుంటే కథకు ప్రాధాన్యత వుండి అది ఏజ్డ్ పాత్ర అయినా దానికి న్యాయం చేసేలా చేస్తే బాగుంటుంది కానీ పాటల కోసమో, ఫైట్ల కోసమో 1980 లాగానో, 1990 లాగానో ఆలోచిస్తే బాక్సాఫీసు దగ్గర గల్లంతు కాక తప్పదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సీనియర్ హీరోలు రీమేక్ సినిమాలు మానుకొని సరికొత్త కథలతో క్రియేటివ్ గా ఆలోచిస్తే కుర్ర హీరోలకు పోటీ ఇవ్వచ్చు లేదంటే ఇలా అవమానాలపాలు కాక తప్పదు. అని ఓ సినీ విశ్లేషకుడు చెప్పారు.