ఈ లేఖ ఎందుకు రాశారో అర్థం కావట్లేదు. ఆచార్య లాభ నష్టాలను కొరటాల శివ భుజాన వేసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్ల లావాదేవీలు నేనే చూస్తానని ముందు కమిట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకుగాను నిర్మాత నిరంజన్ రెడ్డి ముందే తను పెట్టిన మొత్తం తీసుకొని బయటకు వెళ్లారని వార్తలు వస్తున్నాయి. అయినా తన లాభాన్ని వదులుకొని జీ ఎస్టీ అమౌంట్ తనే చెల్లిస్తానని వాగ్దానం చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ రాజ్ గోపాల్ బజాజ్ మెగాస్టార్ కు ఓ లేఖ రాశారు. కర్ణాటక, నైజాం బోర్డర్ లో తెలుగు రైట్స్ కొన్న ఈ డిస్ట్రిబ్యూటర్ మెగాస్టార్ ఛరిస్మా చూసి పెద్ద మొత్తం చెల్లించి వరంగల్ శ్రీను దగ్గర హక్కులు కొన్నామని మెగాస్టార్ దగ్గరుండి తమకు రావలసిన మొత్తాన్ని ఇప్పించవలసిందిగా మెగాస్టార్ ను రిక్వెస్ట్ చేస్తూ ఓ లెటర్ రాశారు. అది కాస్తా వైరల్ అవుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ విదేశాల్లో వున్నారు. స్వతహాగా మెగాస్టార్ చిత్రసీమను ఆదుకునే మనస్తత్వం కాబట్టి తప్పకుండా న్యాయం చేస్తారని నమ్ముతున్నందుకే ఈ లెటర్ వ్రాశానని రాజ్ గోపాల్ బజాజ్ చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే తన రెమ్యునరేషన్ ను వదులుకున్న మెగాస్టార్ ఏ పంథాలో న్యాయం చెబుతారో అని డిస్ట్రిబ్యూటర్లు వేచి చూస్తున్నారు.
మరింత సమాచారం:
Social Plugin