G-N7RFQXDVV7 ఈ వలస తెలుగు సినిమాకు లాభమేనా?

Ticker

6/recent/ticker-posts

ఈ వలస తెలుగు సినిమాకు లాభమేనా?

 




నవ్విన నాపచేను పండుతుంది అనేది అక్షరాలా నిజమైంది. ఒక టైమ్ లో తెలుగు సినిమాను చూసి నవ్వుకునే వాళ్లు. తమిళ, మలయాళ, బాలీవుడ్ కు చెందిన సాంకేతికనిపుణులు తెలుగు సినిమా ఎప్పుడూ ఫార్ములానే పట్టుకొని వేలాడుతుంటుంది. వాళ్లకు కొత్త కథలు నచ్చవు. అని తమిళులు అంటుంటే మరో వైపు స్లో నెరేషన్ అస్సలు ఎంకరేజ్ చెయ్యరు అని మలయాళ సాంకేతిక నిపుణులు చెప్పేవారు. కానీ ఇప్పుడు అన్ని భాషల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి  వలస వచ్చే స్థాయికి  తెలుగు సినిమా ఎదిగింది. అజయ్ దేవగన్, సంజయ్ దత్ లాంటి దిగ్గజాలు హీరో పాత్ర కాక పోయినా సర్దుకొని ఛాన్స్ దొరికితే చాలు మార్కెట్ పెంచుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇటీవల తన రెండు పార్ట్ లతో దేశాన్ని గడగడలాడించిన ప్రశాంత్ నీల్ కూడా తన తదుపరి చిత్రాలు ఎక్కువగా తెలుగులోనే రూపొందించడానికి సిద్ధపడి హైదరాబాద్ కు వచ్చేశారు. గతంలో ఇది రివర్స్ లో వుండేది. సినిమా ఈ రేంజ్ హిట్ అయితే బాలీవుడ్ కు వెళ్లే వాళ్లు. కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ నుంచే దందా మొదలెడదాం అని రాజమౌళి చూపిన మార్గంలో దక్షిణాది దర్శకులు దందా షురూ చేశారు. అయితే ఇక్కడ చిన్న కంఫ్లిక్ట్ నడుస్తోంది… తెలుగు సినిమా దేశవ్యాప్తంగా ఇంత పేరు తెచ్చుకుంటున్నా తెలుగు టెక్నీషియన్లను ఎందుకు ఎంకరేజ్ చెయ్యటం లేదు అంటూ సదరు దర్శకుల వెనుక గుస గుసలాడుకుంటున్నారు. దర్శకులు మాత్రం మీలో టాలెంట్ వుంటే మేమెందుకు పక్కకు తొంగి చూస్తాం. మన హీరోల్లో టాలెంట్ వుంది కాబట్టే కద రాజమౌళి పాన్ ఇండియా సినిమాలు మొదలు పెట్టాడు. అలాగే మీరు మీ పనిని మెరుగుపెట్టుకుంటే మీరు కూడా అందళం ఎక్కచ్చు అంటూ  సినీ పెద్దలు గట్టిగానే చురకలు అంటిస్తున్నారు. సినిమాలకు తెలుగు సినిమానే హబ్ గా మారితే పరిస్థితి ఎలా వుంటుంది అనేది ఇక్కడ ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ప్రముఖ బాలీవుడ్ కంపెనీలు దక్షిణాది నుంచి సినిమాలను నిర్మిస్తే అక్కడి మార్కెట్, ఇక్కడి మార్కెట్ రెండూ సొంతం చేసుకోవచ్చు. లేదంటే ఉత్తర దిక్కును మాత్రమే నమ్ముకుంటే చాలా నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. అందులోనూ దక్షిణాది సినిమాలు ఎమోషన్స్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ నిర్మిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ సినిమాలు ఎంతసేపూ ప్రేమనే టార్కెట్ చేస్తూ నిర్మించేవాళ్లు. కానీ ఈ మధ్య రియలిస్టిక్ స్టోరీలు రూపొందడం ప్రారంభం కాగానే పుష్ప, త్రిబుల్ ఆర్ , కేజీఎఫ్ లాంటి సినిమాలు ప్రేక్షకులను తిరిగి దక్షిణాది వైపు లాక్కున్నాయి. ఇదిలాగే కొనసాగితే బాలీవుడ్ కంపెనీలన్నీ హైదరాబాద్ లో పెట్టుకోవాల్సి వస్తుంది అని ఓ బాలీవుడ్ నిర్మాత చెప్పినట్టు సమాచారం. నిజంగా ఇలా జరిగితే మన తెలుగు సినిమాకు ఎంతో మేలే జరుగుతుంది కద.