G-N7RFQXDVV7 సందిగ్దంలో దిల్ రాజు యూనిట్

Ticker

6/recent/ticker-posts

సందిగ్దంలో దిల్ రాజు యూనిట్

 




వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ కలిసి తమిళ హీరో విజయ్ తో ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియోలో దాదాపు పది కోట్లు పెట్టి ఓ బంగ్లాసెట్ నిర్మించారు. ఫ్లోర్ సరిపోక మరో రెండు బెడ్ రూమ్స్ ను మరో ఫ్లోర్ లో నిర్మిస్తున్నట్టు తెలిసింది. అద్బుతంగా రూపొందించిన ఈ సెట్ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుందని, చిత్ర యూనిట్ వర్గాలు తెలిపారు. బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండే సినిమాలన్నింటికీ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించిన  సునీల్ బాబు ఈ సెట్ బాధ్యతలు తీసుకున్నట్టు తెలిసింది. తెలుగులో ఈయన పంజా, ఊపిరి, మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ చిత్రాలకు వ్యవహరించారు. ఈయనే ప్రొడక్షన్ డిజైనర్ గా కావాలని వంశీ పైడిపల్లి పట్టుపట్టి నియమించుకున్నట్టు తెలిసింది. కాగా  ఇలాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని తమిళ కార్మికులకు పని కావాలనే నెపంతో  పెప్సీ అధ్యక్షుడు సెల్వమణి తమిళ సినిమా షూటింగ్ లు తమిళనాడులోనే జరగాలనే నిబంధన విధించినట్టు తెలిసింది. ఇందుకుగాను రజనీకాంత్, అజిత్ లు తల ఊపారు. విజయ్ ఇంకా తేల్చాల్సి వుంది అనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ విజయ్ కూడా తల ఊపడం జరిగితే మరి ఈ సెట్ మాటేంటి? అని చిత్ర యూనిట్ ఆందోళనలో వున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు సన్నిహితులు మాత్రం మనం చేస్తున్నది తమిళ సినిమా కాదు. డ్యూయల్ ల్వాంగ్వేజ్ కాబట్టి ఈ సినిమాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ వుండవు అని చెబుతున్నారు. విషయం తేలాల్సి వుంది.