పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరోగా రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ పాటకు సంబంధించిన ట్రైలర్, మ..మ..మహేషా పాట, కళావతి పాట సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నాయి. ట్రైలర్ విడుదలయినప్పటి నుంచి అభిమానుల్లో ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా? అన్న ఆత్రుత నెలకొనింది. ఇవన్నీ ద్రుష్టిలో పెట్టకొని మహేష్ బాబు తన అభిమానులకు ఒక లెటర్ రాశారు. సూపర్ స్టార్ అభిమానులందరూ ఈ సినిమాను కేవలం సినిమా థియేటర్లలోనే చూడాలని పైరసీని ప్రోత్సాహించకూడదని కోరుతూ అభిమానులకు ఓ లెటర్ ను విడుదల చేశారు. ఇది చూసిన సినీ విశ్లేషకులు సూపర్ స్టార్ ఆలోచనలు ఢిఫరెంట్ గా వుంటాయి. ఇది మంచి పరిణామం అంటూ పొగుడుతున్నారు. ఫుల్ ఎంటరైటైన్ మెంట్ తో సాగే ఈ సినిమా సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుందని సెన్సార్ రిపోర్ట్ నడుస్తోంది. అభిమానులతో పాటు ప్రతి ప్రేక్షకుడు మహేష్ బాబును ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచి చూస్తున్నారు.
Social Plugin