G-N7RFQXDVV7 ఆచార్య సెటిల్ మెంట్ ఇంతేనా ?

Ticker

6/recent/ticker-posts

ఆచార్య సెటిల్ మెంట్ ఇంతేనా ?




 ఆచార్య సినిమా సెటిల్ మెంట్ ఎలా వుంటుంది అని చాలా మంది బయ్యర్లు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి అప్ట్లో కొంత మొత్తం తీసుకొని లాభనష్టాలన్నీ కొరటాల శివకే వదిలేశారు. సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో మిగతా లాభం కూడా వదిలేశారనీ, జీఎస్టీలు కూడా ఆయనే కట్టడానికి రెడీ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ కూడా ఈ లెఖ్ఖలన్నీ తేల్చుకున్న తర్వాతే మన సినిమా మొదలు పెడదాం అన్నట్టు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయం మీద చర్చిస్తూ కనీసం ముఫ్ఫై కోట్లయినా తిరిగి ఇచ్చేయాల్సి వుంటుంది అని తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం వుంది.ఇంకా కృష్ణా, గుంటూరు, వైజాగ్ ఏరియాల నుంచి కలెక్ట్ చేసిన థియేటర్ల అడ్వాన్స్ లు కూడా చెల్లించాల్సి వుంటుంది. నైజాం, సీడెడ్ ఏరియాల్లో డెఫిసిట్ ఎక్కువగా వుంది కాబట్టి తిరిగి ఎంత చెల్లిస్తారో చూడాల్సి వుంది అని ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు గతంలో అజ్ఞాతవాసి సినిమాలో ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు 28 కోట్లకు నైజాం అమ్మినప్పుడు 9 కోట్ల వరకు తిరిగి చెల్లించారు. కానీ ఇప్పుడు 37 కోట్ల రేంజ్ లో అమ్మారు పదో పన్నెండు రికవరీ అవుతుంది ఆ లెక్కన ఎంత తిరిగి చెల్లించాల్సి వుంటుందో? లెఖ్ఖలు సరిచూడాల్సి వుంది. ఇంకా కర్ణాటక, ఓవర్సీస్ కూడా లెఖ్ఖలు కూడా చూడాల్సి వుంటుంది. వెస్ట్, ఈస్ట్, నెల్లూరు ప్రాంతాల బయ్యర్లకు కూడా ఒకటి నుంచి రెండు కోట్లు వరకు తిరిగి ఇచ్చెయ్యాల్సి వుంటుందని అంచనా వేస్తున్నారు. సినిమా నిర్మాణానికి అయ్యిన ఖర్చు, బిజినెస్ చేసిన మొత్తం సరిచూస్తే ఒక ముఫ్పై నుంచి నలభై కోట్లు మిగులు వుండే అవకాశం వుండి వుంటుంది. అదే తిరిగి ఇవ్వాల్సి వుంటుంది అని పంపిణీదారులు లెఖ్ఖలు వేస్తున్నారు.