G-N7RFQXDVV7 అబ్బా….మెగా, మంచు ఫ్యామిలీ మధ్య మళ్లీ పోటీనా ?

Ticker

6/recent/ticker-posts

అబ్బా….మెగా, మంచు ఫ్యామిలీ మధ్య మళ్లీ పోటీనా ?





 మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి ఈ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.  ఇది సద్దుమనుగుతోంది అనుకుంటున్న టైమ్ లో సన్ ఆఫ్ ఇండియా విడుదల, ఆ తర్వాత తతంగం, మంచు మనోజ్ హైయ్యర్ పర్పస్ పదం, దానికి కౌంటర్లు, ఆ తర్వాత  ఆచార్య విడుదల  అనంతరం విష్ణు ట్వీట్ ఇలా ఒకరినొకరు కవ్వించుకుంటూ నెట్టింటి వారికి వినోదాన్ని పంచుతున్నారు. తాజాగా ఇంకో ఇంట్రస్టింగ్ విషయం బయటికి వచ్చింది.



అప్పట్లో చిరంజీవికి ప్రభుదేవ కొరియోగ్రఫీ అందించిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే కొరియోగ్రఫీకి దూరంగా వున్న ప్రభుదేవ మెగాస్టార్ కోసం, గాడ్ ఫాదర్ లో ఓ పాట కు కొరియోగ్రఫీ అందించడానికి సిద్ధం అయ్యారు. ఇది తెలిసి పోటీపడి విష్షు ‘గాలి నాగేశ్వరరావు’ కోసం తన ఫుల్ ఇన్ ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రభుదేవను ఒప్పించారని, అది తెలపడమే ఆ ట్వీట్ ఉద్దేశ్యమని కొంతమంది నెట్ జనులు అభిప్రాయపడుతున్నారు. ఇలా ప్రతి విషయాన్ని ఈ రెండు ఫ్యామిలీలు ఒకరి నొకరు కవ్వించుకుంటూ వుంటే సోషల్ మీడియాకు ఫుటేజే ఫుటేజ్ అంటూ మరో వర్గం వారు చంకలుగుద్దుకుంటున్నట్టు తెలిసింది.