ఓటీటీలో వున్న ఆదాయాన్ని ద్రుష్టిలో పెట్టుకొని కార్పొరేట్ కంపెనీలు ఒకొక్కటే ఓటీటీ బిజినెస్ లోకి దిగుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, డిస్నీ హాట్ స్టార్, నెట్ ప్లిక్స్ లాంటి సంస్థలు మనదేశంలో ఓటీటీ మార్కెట్ లో మేజర్ షేర్ ను సొంతం చేసుకొని దూసుకుపోతున్నాయి. వీటి వల్ల సినిమా బిజినెస్ అమాంతం ఆకాశాన్ని అంటుతోంది. వందల కోట్లు వెచ్చించి సినిమాలను కొనుగోలు చేసి సినిమా బిజినెస్ ప్రత్యేకత కల్పించాయి. ఈ మార్కెట్ ను కొల్లగొట్టడానికి ఇప్పుడు పారామౌంట్ ప్లస్ ఓటీటీ సంస్థ ఇండియాలోకి అడుగు పెట్టనుంది. ఈ సంస్థ ఇప్పటికే అంతర్జాతీయంగా మంచి ఆదరణ పొందుతోంది. ఇందులో ప్రసారమయ్యే హాలో 1883, స్టార్ ట్రెక్ లాంటి షోలతో అంతర్జాతీయంగా మంచి ప్రాచుర్యం పొందింది. ఈ కార్పొరేట్ సంస్థ మన దేశంలోని రీజనల్ లాంగ్వేజ్ అన్నింటిలోనూ లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్వాహాకులు చెబుతున్నారు.
Social Plugin