G-N7RFQXDVV7 వాళ్ళిద్దరి గొడవ మధ్యలో జయమ్మ కిడ్నాప్ అయ్యింది

Ticker

6/recent/ticker-posts

వాళ్ళిద్దరి గొడవ మధ్యలో జయమ్మ కిడ్నాప్ అయ్యింది





 కరోనా తర్వాత నాలుగు చిన్న సినిమాలు ఒకేసారి విడుదలవ్వడం ఈ శుక్రవారమే జరిగింది. ఈ నాలుగింటిలో జయమ్మ పంచాయితీ పబ్లిసిటీ విషయంలో ముందు వరుసలో వుండేది. స్వతహాగా సుమ టి.వి. యాంకర్ కావడంతో గత రెండు నెలల నుంచి ఈ సినిమాను ప్రమోట్ చేసుకుంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసింది. కానీ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ లో భాగంగా జరిగిన గొడవ మూలంగా కొన్నికోట్లు ఖర్చుపెట్టినా రాని పబ్లిసిటీ ఆసినిమాకు వచ్చింది. దాంతో ఆ సినిమా ప్రమోషన్ ముందు జయమ్మ పంచాయితీ కోసం చేసిన పబ్లిసిటీ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇక రెండూ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్సే కాబట్టి అందరూ అర్జున కళ్యాణం చూడటానికి మొగ్గు చూపారు. అంతేకాకుండా విశ్వక్ సేన్ తన స్టార్ ఇమేజ్ తో జయమ్మ కనిపించకుండా తొక్కేశాడు అని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. అర్జున కళ్యాణంలో కామెడీ కూడా వుండటం సినిమాకు ప్లస్ అయ్యిందని పంపిణీదారుల అభిప్రాయం.