ముందుగా యాంకర్ దేవీ గురించి మాట్లాడుకుందాం. ఒక ప్రతిష్టాత్మక సంస్థలో పని చేస్తూ, పాగల్ సేన్, లాంటి పదాలు వాడటం ఎంతవరకు సమంజసం?... వీళ్లు ఒకసారి బిబిసి లాంటి ఛానెల్స్ చూడరా.. అందులో ఎంత డిగ్జిఫైడ్ గా వుంటారు. వాళ్లు ఎంత హుందాగా ప్రశ్నలు అడుగుతుంటారు. కానీ ఈ ఛానెల్ వాళ్లకు మాత్రమే ఎందుకు ఇంత ఆత్రుత.. సమాజాన్ని వీళ్లే ఉద్దరిస్తున్నట్లు మాట్లాడుతుంటారు. ఈ ఛానెల్ వాళ్లు హుందా ప్రశ్నలతో హుందాగా వ్యవహరిస్తే అవతలి వ్యక్తి స్టూడియోలోకి అడుగు పెడుతున్నప్పుడు ఒకరకమైన భావనతో వస్తాడు. వీళ్లు ఏదో సెన్సేషన్ చేద్దామని సెలబ్రిటీలను కూడా నువ్వు… అంటూ ర్యాష్ గా మాట్లాడితే పర్యవసనాలు ఇలాగే వుంటాయి. మన పట్ల ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తించాలి అనే విషయం మనల్ని బట్టే వుంటుంది. కాబట్టి ఈ సంఘటన జరిగాక అయినా మీ పద్దతులు మానుకుంటే మంచిది అని గతంలో ఇలాంటి ఛానెల్స్ తో అనుభవం వున్న పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు వ్యక్తులు చెబుతున్నారు. ఈ వీడియోను మొదట్నుంచి చూస్తే అసలు ఈ పని ఎవరిది? పోలీసులు చెయ్యాల్సిన పని దాన్ని ఈ ఛానెల్ వాళ్లు భుజానికెత్తుకొని ఏం సాధించాలనుకున్నారు. దాన్ని ఇంటర్వూ చేసి ఎవరికి ఏ సందేశం ఇవ్వాలనుకున్నారు. వాళ్లు తప్పు చేశారు. వాళ్ల మీద లాయర్ కేసు పెట్టాడు అది వాళ్లు చూసుకుంటారు. ఇలాంటివి ప్రసారం చేసి పబ్లసిటీ చేస్తే మరికొంత మంది ఈ దారిలో వెళ్లండి అని అంతర్లీనంగా చెప్పడమే కాదా? అని పలువురు సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే, ఈ చిత్ర యూనిట్ ఇలాంటి ఫ్రాంక్ చేయడం వలన పబ్లిక్ ను థియేటర్ కు తీసుకురావడం కష్టమే. ఫ్రాంక్ అంతరార్థం పబ్లిక్ ను థియేటర్ కు తీసుకురావడం కావాలి కానీ ఇలా కాదు. ఒక వేళ ఇలాంటి ఫ్రాంక్స్ మా సినిమాకు ఉపయోగపడతాయి అని అనుకుంటే ఇలాంటి ఫ్రాంక్స్ పబ్లిక్ లో చేసే ముందు పోలీస్ పరిమిషన్ తీసుకుంటే బాగుండేది. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ కంటే విశ్వక్ సేన్, యాంకర్ దేవీలకే పబ్లిసిటీ వచ్చింది. చాలా మందికి సినిమా పేరు కూడా తెలీటం లేదు. క్రిష్ణానగర్, మణికొండ సెంటర్లలో దీని గురించి ఎవరినైనా అడిగితే ఫలానా స్టూడియోలో విశ్వక్ సేన్ యాంకర్ దేవీ మధ్య గొడవైంది అంటున్నారే తప్ప , సినిమా టైటిల్ చెప్పి ఆ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్ లో భాగంగా అని చెప్పుకోవటం లేదు. కాబట్టి ఈ ప్రయత్నం విఫలమైందనే చెప్పాలి అని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇందులో టి.వి. ఛానెల్ వాళ్ల ఉత్సాహం ఎక్కువ కనిపిస్తోంది. వేగంగా పరిగెత్తే గుర్రానికి కళ్లెం లేకపోతే దిశాగమనం వుండదని ఈ సంఘటనతో మరోసారి నిరూపించారు..
Social Plugin