G-N7RFQXDVV7 జగన్ ను కలిసిన హీరోల సెంటిమెంట్ వెనుక అసలు కథ ఇదీ ?

Ticker

6/recent/ticker-posts

జగన్ ను కలిసిన హీరోల సెంటిమెంట్ వెనుక అసలు కథ ఇదీ ?


 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన హీరోలందరి సినిమాలు వరుసగా ఫ్లాఫ్ లు అంటూ నెట్టింట్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది ఎంతవరకు నిజం? అనేది ఆలోచిస్తే… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన వాళ్లలో ఎస్.ఎస్. రాజమౌళి కూడా వున్నారు. మరి ఆ సినిమా బంపర్ కలెక్షన్లతో విజయం సాధించింది. తెలుగు సినిమా స్థాయి ఏంటో బాలీవుడ్ లో మార్క్ చేసి వచ్చింది. ఇక పోతే ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు సినిమాలు ఆశించినంత విజయం సాధించలేదనేది మరో వాదన. సెంటిమెంట్ కేవలం హీరోలకే వర్తిస్తుంది అనుకుందాం. అలాంటప్పుడు నాగార్జున బంగార్రాజు కు మంచి లాభాలే వచ్చాయిగా…. సెంటిమెంట్ పక్కన పెడితే అసలు విషయం. త్రిబుల్ ఆర్, కేజీఎఫ్, రాథేశ్యామ్, పుష్ఫ  లాంటి సినిమాలు భారీ బడ్జెట్ తో ఒకే కాలంలో విడుదలై ప్రేక్షకుల అంచనాలను పెంచేశాయి. ప్రేక్షకుడి అంచనాలు ఆకాశాన వున్నాయి. ఇలాంటి సమయంలో సాదాసీదా కథతో ప్రేక్షకుల ముందుకు ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు వచ్చాయి కాబట్టే ప్రేక్షకులకు ఆ సినిమాలు రుచించలేదు అని ఒక మానసిక నిపుణుడు తెలిపారు. ఈ మానియా ఇంకా కొద్ది రోజులు వుంటుంది. మరో చిన్న సినిమా హిట్ అయ్యాక పరిస్థితులు చక్కబడతాయి అని చెప్పుకొచ్చాడు.

మరి అఖండ కూడా ఇదే సమయంలో విడుదలైంది కద.. దాని విజయం వెనుక రహస్యమేంటి అని అడిగినప్పుడు.. బాలక్రిష్ణ నుంచి ప్రేక్షకులు అలాంటి సినిమాలే కోరుకుంటారు. యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకుల అంచనాలకు మించి వున్నాయి. సినిమాను అమ్మింది కూడా 48 కోట్ల రేంజ్ కు అమ్మారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు లాభాలు చవి చూశారు. ఇప్పుడు సర్కారు వారి పాట 90 కోట్ల రేంజ్ కు బిజినెస్ చేశారు. ప్రేక్షకుల అంచనాలకు చేరుకోలేదు కాబట్టి లాస్ ను మూటగట్టుకునే అవకాశం వుంది. అదీ గాక ఇప్పుడు ఎంతో గొప్ప సినిమా అంటేనే ఫ్యామిలీలు థియేటర్ కు వస్తున్నాయి. లేకపోతే మరో వారం ఆగితే ఓటీటీలో వస్తుంది. అంత ఖర్చు పెట్టి థియేటర్ కు వెళ్లడం కంటే ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ మొత్తం ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు చూసుకోవచ్చు అని మెంటల్ గా ఫిక్స్ అయ్యారని ఓ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. ఇదిలాగే కొనసాగితే భారీ సినిమాలకు తప్పితే, చిన్నా చితక సినిమాలకు ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లే పరిస్థితి కనిపించటం లేదు.


రంగ మార్తాండ వెనుక క్రిష్ణవంశీ ప్లానేంటి?

కొడుకు పోయినప్పటి నుంచి కోట కు మతి భ్రమించింది