మీడియా, పైరసీ వల్ల సరవ్వత్రా అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇది మన స్టేట్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా అదే సమస్యతో సతమతమవుతున్నారు. సమాచార పంపకం అనేది. మూవీ రూల్జ్ లైమ్ వైర్, బిట్ టోరంట్ వంటి సర్వీసుల ద్వారా ఎక్కువ గా జరుగుతుంది. వీటి ద్వారా యూజర్లు తమకు కావలసిన సంగీతాన్ని ఇతర విషయాలను ఈజీగా యాక్సెస్ చేసి తీసుకో గలుగుతున్నారు. అది కూడా ఉచితంగా అలా పైరసీ దారులు ఎక్కువ ఉపయోగించే కంటెంట్ ను నెట్ ఫ్లిక్స్ డబ్బులిచ్చి కొనుక్కోంటోదని తెలిసింది. తమ కంటెంట్ ను విస్తరించడంలో బాగంగా ఈ పనులను చేపడుతోంది. నెట్ ఫ్లిక్స్ కు చెందిన కెల్లీ మెరియాన్ (నెదర్లాండ్ వెబ్ సైట్) మాట్లాడుతూ మేము ఏదైనా కొనేటప్పుడు వాటిలో పైరసీ సైట్లలో వేటికి ఎక్కువ ఆదరణ వుందో గమనిస్తున్నాం. ఉదాహరణకు ప్రిసన్ ఏ్రబెక్ అనేది డచ్ మార్కెట్లో పైరసీ సైట్లలో ఎంత పెద్ద కి్లక్ అయ్యిందో తెలిసిందే.. అందువల్లే మేము ఆ సి.డి. రైట్స్ తీసుకున్నాం. అని అన్నారు. పైరసీకి వ్యతిరేఖదారులు కూడా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ పనులను మెచ్చుకుంటున్నారు. మ్యూజిక్ మూవీస్, టి.వి. షొోలు, వీడియో గేమ్ లను ప్రజలు టోరెంట్ సైట్ల ద్వారా ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకుంటుంటారు. వేటికి ఎక్కువ ఆదరణ వుందో నెట్ ఫ్లిక్స్ వాళ్లు సమాచారాన్ని తీసుకుంటారు. దాన్ని కొని తమ సైట్లలో వుంచుతారు. కానీ అప్పటిదాకా ఫ్రీగా సమాచారం దొరికే సమాచారం. జనాలు ఎందుకు డబ్బులిచ్చి చూడాలి అని అడిగితే అందుకు సమాధానంగా వాళ్లు డౌన్ లోడ్ చేసుకునేదానికో, కంటెంట్ కో డబ్బులు కట్టరు. ఈ జీ యాక్సెస్ కోసమే కడతారు. అనే సమాధానం వస్తోంది. నెట్ ఫ్లిక్స్, సిఇఓ, మాట్లాడుతూ టొరెంట్లలో సులభంగా సమాచారం దొరుకుతున్న మాట వాస్తవమే. కానీ నెట్ ఫ్లిక్స్ లో గంటల తరబడి వెతక్కర్లేదు. పైల్స్ ను గంటల తరబడి డౌన్లోడ్ చేయనక్కర్లేదు. జెస్ట్ క్లిక్ చేస్తే చాలు, జెస్ట్ క్లిక్ చేసి సినిమాను చూసెయ్యచ్చు వెతుకుతూ సమయాన్ని వ్రుధా చేయడం కన్నా సులబంగా మనకు అందుబాటులోనే వుంటే ఎవరైనా ఇష్టపడతారు అని అన్నారు. ఆయన కొనసాగిస్తుూ నెట్ ఫ్లిక్స్ను కెనడాలో మూడేల్ల క్రితం మొదలు పెట్టాం. అక్కడ బిట్ టొరెంట్ యాభై శాతం డౌన్ అయిపోతుంది. మా ధాటికి ఫ్రీ ప్లాట్ ఫార్మ పరిస్థితి పడిపోతుంది అని అంటున్నారు. అయినా ఉచితంగా అలవాటు పడిన జనాలు ఇలాంటి వాటికి ఎలా ఆకర్శితులవుతారో వేచి చూడాల్సిందే.
Social Plugin