G-N7RFQXDVV7 ఏకంగా జబర్ధస్త్ జడ్జి పోస్ట్ కే గాలమా?

Ticker

6/recent/ticker-posts

ఏకంగా జబర్ధస్త్ జడ్జి పోస్ట్ కే గాలమా?


టి,వి షో జబర్ధస్త్ చాలా పాపులర్ అయ్యింది. అందులో నటించిన ఎంతో మంది నటులు కమెడియన్లు గా మారి తెలుగు స్క్రీన్ పై చోటు సంపాదించుకున్నారు. ఇదిలా వుంటే ఈ మధ్య జబర్ధస్త్  మీద పరిస్థితులు పగ బట్టాయి. షో లీడింగ్ లో వున్న సమయంలో చమ్మక్ చంద్ర, అదిరే అభి లాంటి వాళ్లు సైడయిపోయారు. పోయినోళ్లందరూ మంచోళ్లు. వున్న వాళ్లు పోయినోళ్ల తీపి గురుతులు అనే స్లోగన్ తోనే జబర్ధస్త్ ముందుకు నడుస్తోంది. కానీ జబర్దస్త్ లో జడ్జి స్థానానికి ఓ ప్రత్యేకత వుంది. షో అయిపోయాక సరైన కామెంట్లు ఇవ్వడం, పార్టిసిపెంట్లు షో చేస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా ఇన్వాల్వ్ అయ్యేలా నవ్వడం, సెటైర్లు వెయ్యడం లాంటివి చాలా అవసరం. గతంలో రోజా, నాగబాబు కాంబినేషన్ చూడ ముచ్చటగా వుండేది. నాగబాబు బయటికి వెళ్లిపోయాక కొద్ది రోజులు అటు ఇటు అయినా, మను వచ్చి ఆ స్థానాన్ని భర్తీ చేశారు. రోజ లేనప్పుడు ఇంద్రజ వచ్చి రోజా స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నించారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు కానీ ప్రస్థుతం జబర్ధస్త్ కు ‘అంతకు మించి’ న జడ్జి అవసరం. అంటే అర్థం కాలేదా…. జబర్ధస్థ్ మొదట్నుంచి ఎక్స్ పోజింగ్, అడల్ట్ జోకులతోనే నెగ్గుకొస్తోంది. రోజా వెళ్లిపోయాక జబర్ధస్థ్ లో కొంచెం హాట్ జడ్జి వుంటే యూత్ ను ఆకట్టుకోవచ్చని మేనేజ్ మెంట్ అంచనా వేస్తోంది. గతంలో అనసూయ, రష్మి లను కూడా పొట్టి పొట్టి డ్రెస్ లు వేసి యువతను ఆకట్టుకుంటూ జబర్ధస్థ్ ను అలవాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు హాట్ జడ్జి అంటే శ్రద్ధ దాస్ అయితే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నారు. మరి కొందరు మాత్రం హంసానందిని కి ఓటేశారని తెలుస్తోంది. జడ్జిలను ఓకే చేశాక కంటెస్టెంట్లలో కూడా మార్పులు చేసే ఆలోచనలో వున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కాస్త బయటకు పొక్కి కొంతమంది హాట్ హీరోయిన్లు జబర్ధస్త్ జడ్జిలుగా గాలం వేస్తూ, మెసేజ్ లు పెడుతున్నారని తెలిసింది.



కొడుకు పోయినప్పటి నుంచి కోట కు మతి భ్రమించింది