ఈ పేరు వింటేనే ప్రతి తెలుగువారి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది .నయనానంద కరమైన అందమైన రూపం. వీనులవిందైన స్వరం ఆయన సొత్తు . సినీరంగంలోనే కాదు ,రాజకీయ రంగంలో కూడా సంచలనం సృష్టించిన వ్యక్తి. మహాశక్తి .సినిమా రంగంలో కథానాయకుడిగానే కాక పలు శాఖలలో పట్టు ఉన్న వ్యక్తి .ఎంతటి కష్టమైన పనిని అయినా పట్టుదలతో విజయవంతంగా నిర్వహించే వ్యక్తి .సినిమా రంగంలో అతను సృష్టించిన సంచలనాలు ,అన్నీ ఇన్నీ కావు పౌరాణిక, జానపద, చారిత్రాత్మక ,సాంఘిక చిత్రాలలో ఎన్నో విజయాలు సృష్టించారు .వంద రోజులు ప్రదర్శింపబడని చిత్రాలలో కూడా ఎన్నో మంచి చిత్రాలు ఉన్నాయి. తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ మరిచిపోలేనని చిత్రాలు ఎన్నో ఉన్నాయి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన నటించి శతదినోత్సవాలు జరుపుకున్న చిత్రాలు యొక్క పేపర్ కటింగ్ లు ఈ వీడియోలో పొందుపరిచాం. వాటిని చూసి ఎన్టీఆర్ గారి అభిమానులే కాదు , తెలుగు ప్రేక్షకులందరూ తప్పక ఆనందిస్తారు. ఈ పేపర్ కటింగ్స్ సేకరణలో ఎంతో శ్రమకూర్చి మాకు సహకరించిన కొడాలి ప్రసాద్, రాజమండ్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు .
Social Plugin