G-N7RFQXDVV7 భవిష్యత్తులో ఓటీటీ కే భారీ మద్దతు

Ticker

6/recent/ticker-posts

భవిష్యత్తులో ఓటీటీ కే భారీ మద్దతు

 


ప్రతి పరిశ్రమ దైనందిక కార్యకలాపాల్లో అనాది నుంచి సాంకేతిక పురోగతి అంతరాయాన్ని కలిగిస్తునే వస్తోంది. ఇలా మార్పు చేసుకున్న ప్రతిసారి పరిశ్రమల ముఖచిత్రం మారిపోతూ వుంటుంది. ప్రస్తుతం సినిమా రంగం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అనాది నుంచి సినిమాకు ఒక ప్రత్యేక స్థానముంది. టెలివిజన్, కేబుల్ టీ.వి, విసిడి, డివిడి, బ్లూరే, లాంటివి ఎన్నిమాద్యమాలు వచ్చిన సినిమా తన స్థానాన్ని పదిలంగా అలాగే వుంచుకుంది. కానీ ఇప్పుఇప్పుడే సినిమా స్థానం ప్రశ్నాత్మకమవుతుందా అనే సంశయం ప్రముఖ సినిమా విశ్లేషకులను వేదిస్తోన్న ప్రశ్న.  ఎందుకంటే ఇ కామర్స్ వచ్చాక విదేశీ యాప్ లు ఎంటరై చిన్న కూరగాయల బండి పెట్టుకునే వాడి బిజినెస్ తో పాటు చిన్న చిన్న హోటల్స్ నడుపుకునే వాళ్లు బిజినెస్ లను దెబ్బ తీసింది. వాళ్లు మా పెద్దల నుంచి వచ్చిన బిజినెస్ నేను సంప్రదాయకంగానే వ్యవహరిస్తాను అంటే వెనుకబడిపోవటం తప్పదు. కాబట్టి ఎవ్వరైనా మారాల్సిందే. ఇక  ఆన్ లైన్ షాపింగ్ గురించి చెప్పుకుంటే ఇంట్లో కూర్చొనే  యు.ఎష్, యు.కే అంటూ ఏ ఇతర దేశాల్లో వున్న వస్తువులనైనా ఇట్టే  కొనేస్తున్నారు. మధ్య తరగతి వాళ్లు ఎక్కువగా వున్న మనదేశంలో విదేశీ వస్తువుల మీద వున్న మోజు ను ఇ కామర్స్ టాప్ చేసింది. సక్సెస్ అయ్యింది. ఇన్ని విప్లవాత్మక మార్పులు వచ్చినా సినిమా మాత్రం పదిలం. ప్రతి ప్రేక్షకుడు వినోదం కోసం థియేటర్ కు వెళ్లాల్సిందే అని వాదించే వాళ్లను కూడా ఆలోచింపజేసేలా ఓవర్ ది టాప్ ( ఓటీటీ ) ఫ్రేమ్ లోకి వచ్చింది. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ వల్ల ఈ ఫ్రేమ్ కాస్త పెద్దదయ్యింది. ఇటీవల ఓ మీటింగ్ లో సినీ ప్రముఖులు అల్లు అరవింద్, డి. సురేష్ బాబు కూడా ఇక రాబోయే కాలమంతా ఓటీటీ దే అంటూ సొంత యాప్స్ కూడా ప్రారంభిస్తున్నారు.








ఓటీటీ: 

 అసలు ఓటీటీ అంటే ఏమిటి? .. మనం చూడాలనుకున్న ఒక వీడియోను వీక్షించడానికి (వీడియో ఆన్ డిమాండ్) ను ఇంటర్నెట్ ద్వారా కానీ లేదా ఒక అప్లికేషన్ ద్వారా కానీ స్ట్రీమింగ్ చేయడాన్ని ఓటీటి. (ఓవర్ ది టాప్)  అంటారు.. వీటిని కింది వర్గాలుగా విభజించారు.


SVOD – subscription video on demand       

  SVOD : సాధారణంగా కేబుల్ టీవికి నెల నెల ఒక చందా చెల్లించి కోరుకున్నంత కంటెంట్ ను ఎలా పొందుతామో అదే పద్దతి ఇక్కడ కూడా వుంటుంది. కాకపోతే ఇక్కడ మనకు కావలసిన కంటెంట్ ను వీలైనప్పుడు, కావలసిన టైంలో చూసే వీలుంటుంది.

ఈ పద్దతిలో ప్రస్తుతం నెట్ ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, జీ5, ఆహా లాంటి యాప్స్ ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పైన చెప్పిన యాప్స్ లో లేటెస్ట్ సినిమాలు, పాత సినిమాలను స్టోర్ చేసి పెడతారు. ఇందులో ఎలాంటి అడ్వర్టైజ్ మెంట్ వుండదు. వీళ్లకు కేవలం చందా ద్వారానే ఆదాయం సమకూరుతుంది.SVOD వల్ల వినియోగదారునికి, సంస్థకు దీర్ఘకాలిక ఒప్పందం వుండదు కాబట్టి వినియోగదారుడు ఎప్పుడైనా వెళ్లిపోవడానికి అవకాశముంది. కాబట్టి SVOD ప్రొవైడర్లు కొత్త రకమైన కంటెంట్ ను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ వినియోగ దారుడు చేయిజారిపోకుండా కాపాడుకోవాలి. దీంట్లో ఏమాత్రం అలసత్వం పొందినా వినియోగదారుడు జారిపోయే ప్రమాదం వుంది. ఇది సర్వీస్ ప్రొవైడర్లకు సవాలుగా వుంటుంది. 




ఇప్పుడున్నకంటెంట్:

అమెజాన్, నెట్ ప్లిక్స్,  హాట్ స్టార్, లాంటి యాప్స్ గురించి చర్చించుకుంటే ఈ యాప్స్ లో భారతీయ వినియోగదారులను ఆకర్శించడానికి ఎప్పటికప్పుడు లోకల్ కంటెంట్ ను యాడ్ చేస్తూ, తమకున్న వినియోగదారులు ఎక్కడికీ వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. చాలా యాప్స్ లో భారతీయవినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూసే సినిమాలను టార్గెట్ చేసి వాటినే ఎరగా వేసి యాప్స్ ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు.. హార్రర్, రొమాన్స్, డ్రామా, ఇలా జోనర్ ను బట్టి సినిమాలు వుండేలా కేటగిరీలుగా విభజించి వినియోగదారుడు ఈజీగా అర్థం చేసుకొని బ్రౌస్ చేసేలా రూపొందించారు.  ఇక హాట్ స్టార్ ఒకడుగు ముందుకేసి ‘మా ’ టీవిలో ప్రసారమైన సీరియల్స్ ను కూడా ఇందులో పొందుపరిచింది. అంతేకాకుండా ఒకడుగు ముందుకేసి స్పోర్ట్స్ మీద ఎక్కువగా కాన్ సంట్రేషన్ చేసింది. క్రికెట్ మీద ఆసక్తి వున్న ప్రతి ఒక్కరూ హాట్ స్టార్ కనెక్షన్ తీసుకునేలా రూపకల్పన చేసి వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అమెజాన్  యాప్ లో  లోకల్ కంటెంట్ డామినేట్ చేస్తోంది. చందారూపేనా సంవత్సరానికి 999 రూపాయలు వసూలు చేస్తున్నారు.

నెట్ ప్లిక్స్ యాప్ లో లోకల్ కంటెంట్ తక్కువ. సబ్ స్క్రిప్చన్ ఎక్కువ కాబట్టి తెలుగు రాష్ట్రాలలో యూసేజ్ తక్కువగా వున్నట్టు తెలుస్తోంది.


TVOD – transactional video on demand


TVOD అనేది  చందా చెల్లించి చూసే వీడియో పూర్తిగా వ్యతిరేఖం. ఇక్కడ వినియోగదారుడు ఒకసారి చూసినందుకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి వుంటుంది.  ఇందులో రెండు కేటగిరీలు వుంటాయి 


  1. ఎలక్ట్రానిక్ సేల్-త్రూ (EST)  ఒక వీడియోను చూడటానికి పరిమినెంట్ గా కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. 

  2. అద్దెకు డౌన్‌లోడ్ చేసుకోవడం (డిటిఆర్), : ఇక్కడ  వినియోగదారుడు పరిమిత సమయం కోసం కొంత మొత్తాన్ని చెల్లించి కంటెంట్ ను పొందుతాడు

ఈ పద్దతిలో వినియోగదారుడు అవసరమైన కంటెంట్ కోసం పలుసార్లు వస్తుంటాడు కాబట్టి ఇది ప్రొవైడర్ కు మంచి ఆదాయాన్ని అందించే వనరుగా వుంటుంది. ఈ పద్దతికి ఉదాహరణగా ఐటూన్స్, అమెజాన్ వీడియో స్టోర్ లాంటివి  తీసుకోవచ్చు.



AVOD – advertising-based video on demand


SVOD మరియు TVOD సేవల మాదిరిగా కాకుండా, AVOD వినియోగదారులకు ఉచితం. అయితే ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు యాడ్స్ ప్లే అవుతాయి కాబట్టి ఆదాయం యాడ్స్ రూపేన వీడియో ప్రొవైడర్ కు అందుతుంది.

 ఉదాహరణగా చెప్పుకోవాలంటే  డైలీమోషన్, యూట్యూబ్ మరియు 4OD ..

కంటెంట్ యాజమాన్యం  ఈ AVOD పైన పెద్ద ఆసక్తి కనబరచడం లేదు. ఎందుకంటే ఇది SVOD మరియు TVOD కంటే తక్కువ మొత్తంలో ఆదాయాన్ని సమకూరుస్తుంది. 

యాడ్ మొత్తం తక్కువగా వుంటుంది కాబట్టి యూజర్స్ ను పట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. 

అయినా ప్రస్తుతం ఇండియాలో ఈ మోడల్ నే ఎక్కువగా వాడుతున్నారు.




ఓటీటీ సక్సెస్ కావడానికి కారణాలు

ప్రస్తుతం వినియోగదారులు బయటకు వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదు. ఇంట్లోనే కూర్చొని తమకు కావలసినవన్నీ సమకూర్చుకోవాలనే ఉద్దేశ్యంతో వున్నారు. అందుకే అందుకే 2017 నాటికి 2020 నాటికి ఇ కామర్స్ విపరీతంగా అభివ్రుద్ధి చెందింది. ప్రపపంచ వ్యాప్తంగా జనాభా, ఆదాయం పెరుగుతున్న ద్రుష్ట్యా కంటెంట్ వినియోగం కూడా పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


  1. సగటు ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే యావరేజ్ గా 70 రూపాయలు ఒక టికెట్ కు వెచ్చించాల్సి వుంటుంది. అదే ఓటీటీలో సబ్ స్రైబ్ చేసుకుంటే ఇంటిల్లిపాది నెల రోజులు చూడచ్చు అనుకునే పరిస్థితి వుంది. ఇంటర్నెట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అందుబాటులో వుంది  గతంలో యూ టూబ్ లో దొరికిన సినిమాలు ఇప్పుడు యుటూబ్ లో దొరకడం లేదు. సినిమాలు రిపీటెడ్ గా చూడాలనిపించినా, కొత్త సినిమాలు ఎప్పటికప్పుడు కావాలనిపించినా ఓటీటీనే బెటర్ అని సగటు ప్రేక్షకుడు ఓటీటీ వైపు ఆసక్తి కనబరుస్తున్నాడు.

  2.  దక్షిణాదిన ఈ మధ్య చాలా సినిమాలు శాటిలైట్ రైట్స్ అమ్మకుండా అలాగే వుండిపోయాయి. అంతెందుకు ఇటీవల ఓ పత్రిక ప్రచురించిన కథనం ఆదారంగా తీసుకుంటే తమిళనాడులో  గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు 300 సినిమాలు శాటిలైట్ రైట్స్ అమ్మకుండా అలాగే వుండిపోయాయి. ఎందుకంటే సదరు ఛానెల్స్ కు ఈ రేటు వర్కవుట్ కావటం లేదు. ట్రాయ్ 12 నిమిషాల కంటే ఎక్కువ అడ్వర్టైజ్ మెంట్స్ ప్రసారం చేయకూడదు అనే నిబంధన విధించడంతో శాటిలైట్ రైట్స్ కు వెచ్చించే అమౌంట్, 12 నిమిషాల వ్యవధితో మాత్రమే ప్రసారం చేసే యాడ్స్ వల్ల వచ్చే మొత్తం టి.వి. ఛానెల్స్ కు మ్యాచ్ కావటం లేదు. అందుకే ఆ దిశగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. అంటే ఇక్కడ AVOD – advertising-based video on demand మెథడ్లో వుంది కాబట్టి ఆ రేటు వర్కవుట్ కావటం లేదు. ఓటీటీ ఛానెల్స్  SVOD – subscription video on demand మెథడ్ లో వుంటాయి కాబట్టి ఎక్కువ మొత్తానికి కొనే అవకాశం వుంది. ఇది నిర్మాతకు లాభదాయకం కాబట్టి ఓటీటీ పైనే నిర్మాత ఆసక్తి కనబరుస్తారు.

  3.  భారతీయ వినోదం  2022 లో 52,683 మిలియన్ డాలర్లు (3,432,044 మిలియన్ INR) కు పెరుగుతుందని అంచనా. టెలివిజన్, సినిమా మరియు OTT సమిష్టిగా 2017 నుండి 2022.1 వరకు భారత వినోదం మరియు మీడియా పరిశ్రమలో మొత్తం వృద్ధిలో 46% వాటా ఉంది

  4. .సినిమాలు అద్దెకు తీసుకొని ఏ రేంజ్ లో చూస్తారు అనే అంశాన్ని 1997 లోనే నెట్ ఫ్లిక్స్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ దశాబ్దంలో పెద్ద విజయాన్ని సాధించింది పెద్ద సంస్థగా కూడా ఎదిగింది. . ప్రస్తుతం సినిమాలను అద్దెకు చూసే వ్యాపారంలో భారతదేశం అగ్రస్థానంలో వుందని చెప్పాలి… ఆన్ లైన్ స్ట్రీమింగ్ వినియోగదారులకు నిరంతరాయంగా సినిమాలు చూసే అనుభవాన్ని అందిస్తుంది. కాబట్టి భారతీయ వినియోగదారుడు వినోదానికిపెద్ద పీట వేస్తాడు.కాబట్టి ఓటీటీ ఇక్కడ సక్సెస్ అవుతుంది.

  5.  సాధారణంగా ఇండియాలో ఎక్కువ శాతం కేబుల్ కనెక్షన్ ల మీద ఆదారపడ్డారు. స్మార్ట్ టి.విలు , ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక కొత్త సినిమాలు చూడాలనే ఉద్దేశ్యంతో అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి యాప్స్  డౌన్ లోడ్ చేసుకొని ఇప్పటికే కోట్ల కొద్దీ వినియోగదారులు వినోదాన్ని పొందుతున్నారు. కాబట్టి యాప్ ను పబ్లిక్ లోకి తీసుకెళ్లి వాళ్లను ఎడ్యుకేట్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.

  6.  ప్రస్తుతం యాప్స్ అన్నీ సినిమాల మీద, వెబ్ సీరిస్ లపైనే కాన్ సంట్రేషన్ చేస్తున్నాయి. న్యూస్ ఛానెల్స్ టి.వి.లపైన, యూ ట్యూబ్ పైన మాత్రమే ఆధారపడి వున్నాయి. ఓ టి.టి వలన ప్రేక్షకుడు తనకు కావలసిన వీడియోను తనకు వీలున్న టైంలో చూసే అవకాశం లభించింది. కొన్ని ప్రత్యేకంగా చూడాలనుకుంటే తనికష్టమైన డివైజ్ లో ప్రత్యేకంగా కూర్చొని చూసే అవకాశం కూడా వుంది కాబట్టి వినియోగదారులు ఎక్కువగా ఓటీటీని ప్రిఫర్ చేస్తున్నారు.

 

Content continues to be king


అమెజాన్, నెట్ ప్లిక్స్ లాంటి యాప్స్ రీజనల్ కంటెంట్ చాలా ముఖ్యం అని తెలుసుకున్నాయి అందుకే ఆయా విభాగాల మీద బాగా కాన్ సంట్రేషన్ చేస్తున్నాయి. చాలా వరకు వెబ్ సీరిస్ లను, రీజనల్ ల్యాంగ్వేజ్ లో వుండేలా డబ్బింగ్ చేస్తూ, స్ట్రోలింగ్ కూడా రీజనల్ లాంగ్వేజ్ లో వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.ఇండియాలో  రీజనల్ కంటెంట్ లేకపోతే మనుగడ చాలా కష్టం అనే విషయం వాళ్లకు తెలిసిపోయింది. కాబట్టి ఈ చర్యలు చేపట్టాయి.

ఈ కంటెంట్ ను ఇప్పటి వరకు సినిమాల ద్వారా మాత్రమే ప్రేక్షకులకు అందించడానికి వివిధ యాప్స్ ప్రయత్నిస్తున్నాయి. ఓ టీటీలో  ఒక 15 నిమిషాల ఎపిసోడ్ చేయడానికి 15 నుంచి 20 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. నెట్ ప్లిక్స్ ఇంకా ఎక్కువే కంటెంట్ కోసం వెచ్చిస్తోందని తెలుస్తోంది. 

 VOD వీడియో ఆన్ డిమాండ్ సినిమాను ఎప్పటికీ కిల్ చేయలేదు. ఎందుకంటే సినిమా ఎక్స్ పీరియన్స్ వేరే వుంటుంది. సినిమాకుండాల్సిన డిమాండ్ ఎప్పటికీ అలాగే వుంటుంది. ఉదాహరణకు బాహుబలి లాంటి గ్రాఫిక్స్ ఎక్కువగా వుండే సినిమాలను థియేటర్లో చూసే అనుభూతి ఇంట్లో చూస్తే రాదు. కాబట్టి ఆ స్థాయి సినిమాలకు థియేటర్లలో ఎప్పటికీ డిమాండ్ వుంటుంది. న్యూస్ లేదా ఇతర ఆసక్తికరమైన కంటెంట్ ను ఎక్కడా చూడటానికి ఆస్కారముండదు. ఓటీటీలోనే రిజిస్టర్ చేసుకోవలసిన అవసరం వుంటుంది. భవిష్యత్తులో న్యూస్ ఛానెల్స్ కూడా ఓటీటీ ఫ్లాట్ ఫాం మీదకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.