G-N7RFQXDVV7 ఇదేం ఖర్మరా బాబూ.. కొరటాల చేసిన పనికి రాజమౌళి ఏం చెబుతాడు?

Ticker

6/recent/ticker-posts

ఇదేం ఖర్మరా బాబూ.. కొరటాల చేసిన పనికి రాజమౌళి ఏం చెబుతాడు?

 


తెలుగు సినిమా కు  బ్రాండ్ అంబాసిడర్ గా  రాజమౌళిని చెబుతుంటారు. రాజమౌళి ఒక్క సినిమాలో నైనా నటించడానికి ప్రతి హీరో కలలు కంటూ వుంటాడు. యంగ్ హీరోలైతే రాజమౌళి నుంచి ఎప్పుడు పిలువు వస్తుందా? అని వేచి చూస్తుంటారు. అలాంటిది చాలా కాలం నుంచి ఒక సెంటిమెంట్ తెలుగులో చక్కర్లు కొడుతోంది. దాన్ని రాజమౌళి ముందుకు కూడా ఇటీవల తీసుకెళ్లారు. కానీ రాజమౌళి దానికి లాజిక్ లేదంటూ దాటేశారు. ఇంతకూ ఆ సెంటిమెంట్ ఏంటి? అంటే రాజమౌళి సినిమాలో నటించిన హీరోలకు వరుసగా ఫ్లాప్ లు వస్తాయనేది ఆ సెంటిమెంట్.  ఈగ సినిమాలో నానికి చిన్నరోల్ ఇచ్చినా ఆ తర్వాత నాని దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రభాస్ కూడా ఇంకా ఆ ప్రభావం నుంచి కోలుకోలేక వున్నాడు. త్రిబుల్ ఆర్ తర్వాత ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చింది. సెంటిమెంట్ ను నిజం చేస్తూ, ఆచార్య డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది అని నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి ఫ్యాన్స్ మాత్రం దానికి రాజమౌళి తప్పు ఎలా అవుతుంది. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన కొరటాల శివ బాధ్యత వహించాలి. ఆచార్య ఫ్లాప్ అయితే రాజమౌళిని నిందించడం కరెక్ట్ కాదు అంటూ వాదిస్తున్నారు.

అమెజాన్ లో సమ్మర్ స్పెషల్ గా కూలర్స్ కు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు.. కింద లింక్ ద్వారా అమెజాన్ పోర్టల్ కు వెళ్లి మీకు నచ్చిన ఎయిర్ కూలర్ కొనండి.