ప్రస్తుతం ‘పుష్ప, త్రిబుల్ ఆర్, కేజీ ఎఫ్ 2 చిత్రాలు దక్షిణాది బాక్సాఫీసులో కలకలం స్రుష్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇటీవల పలు వురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆ మధ్య జాన్ అబ్రహాం నేను రీజనల్ సినిమాల్లో నటించను అని స్టేట్ మెంట్ ఇవ్వడంతో బాలీవుడ్ రీజనల్ కాదా? హిందీ జాతీయ భాష అని ఎవరైనా రాసిచ్చారా? ఒకసారి రైట్ టు యాక్ట్ ద్వారా తెలుసుకోండి అంటూ వివాదం చెలరేగింది. మరో వైపు అజయ్ దేవగన్ కూడా తన మనసులోని ద్వేషాన్ని బయట పెట్టారు. ఇటీవల అభిషేక్ బచ్చన్ కూడా బాలీవుడ్ లో టాలెంట్ లేదు అనడం సరికాదు అంటూ తన కుళ్లుబోతుతనాన్ని బయట పెట్టాడంటూ పలు పత్రికలు రాశాయి. కాగా దక్షిణాది సినిమాలను చూసి బాలీవుడ్ వెన్నులో వణుకు పుడుతోందని జాతీయ అవార్డు గ్రహీత మనోజ్ బాజ్ పాయ్ వ్యాఖ్యానించడం పుండు మీద కారం చల్లినట్టయ్యింది… వరుసగా మూడు సినిమాలు నార్త్ ఇండియా బాక్సాఫీసును షేక్ చేస్తున్న నేపథ్యంలో దక్షిణాది సినిమాలను ప్రశంసిస్తూ బాలీవుడ్ దర్శకులకు చురకలు అంటించారు. రాబోయే కాలంలో పుష్ప 2, లైగర్ లాంటి సినిమాలు త్వరలోనే బాలీవుడ్ స్క్రీన్ ను టచ్ చేయనున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా విజయం సాధిస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు బాలీవుడ్ లో వున్న హీరోలకే దిక్కు లేకుంటే ఇప్పుడు దక్షిణాది హీరోలు కూడా ఇక్కడికి వచ్చి బాక్సాఫీసు కలెక్షన్ షేర్ చేసుకుంటే మాకేం వేల్యూ వుంటుంది అని కొందరు యువ హీరోలు తమ ఆక్రోశం వెలిబుచ్చినట్టు తెలిసింది. ఇదిలాగే కొనసాగితే ఉత్తరాది, దక్షిణాది మధ్య అంతరం పెరిగేలా వుంది. అంటూ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
Social Plugin