G-N7RFQXDVV7 దేవి శ్రీ గొప్పనో? థమన్ గొప్పనో? తేల్సాల్సింది మీరే

Ticker

6/recent/ticker-posts

దేవి శ్రీ గొప్పనో? థమన్ గొప్పనో? తేల్సాల్సింది మీరే




సూపర్ స్టార్ మహేష్ బాబు  హీరోగా న‌టించిన  సర్కారు వారి పాట.  చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించారు. ఈ మ్యూజిక్ ఇప్పటికే మ్యాజిక్ ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన కళావతి... కళావతి సాంగ్ మెలోడి ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఈ పాట ఇప్పటికే వంది మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసిన ఈ పాట ఇప్పుడు టాలివుడ్ ఫాస్టెట్ 150 మిలియన్ వ్యూస్ ను  క్రాస్ చేసి అరుదైన రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.9 మిలియన్స్ కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది.  కళావతి పాట ఇంటర్నెట్ సెన్సేషన్ గా నిలవడమే కాకుండా స్ట్రీమింగ్ వేదికల్లో, యాప్స్ లో ఈ పాట ట్రెండింగ్ లో నిలిచింది. 

అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను సిద్ధ్ శ్రీరామ్ పాడారు. ఇక పోతే దక్షిణాదిన థమన్, దేవిశ్రీ ప్రసాద్ కు గట్టి పోటీ ఇస్తున్నాడు . దేవిశ్రీ ఒక వైపు మాస్ ను ఆకట్టుకునే పాటలను కంపోజ్ చేస్తుంటే థమన్ మరో వైపు క్లాస్ ను తన చుట్టూ చేర్చుకుంటున్నాడంటూ నెట్ జనులు అభిప్రాయపడుతున్నారు. థమన్ రూపొందించిన కళావతి సాంగ్ 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది కద మరి ఇంత ఫాస్ట్ గా దేవిశ్రీ పాటలు ఎందుకు ఆ టార్గెట్ క్రియేట్ చేయలేకపోయాయి అనేది అందరి మనుసులో కలుగుతున్న ఆలోచన. అయితే థమన్ అభిమానులు మాత్రం  మాస్ సాంగ్స్ అప్పటికప్పుడు ప్రేక్షకుల్లో, అభిమానుల్లో పూనకం తేవచ్చేమో కానీ, మెలోడీ సాంగ్స్ అనేవి ఎప్పటికీ  ప్రేక్షకుల హ్రుదయాలలో అట్టే నిలిచిపోతాయి అంటూ సమాధానం ఇస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి మంచి పాటలు తెలుగు చిత్ర సీమ నుంచి రావడం ఆనందంగా వుంది.

ఇక పోతే సర్కారు వారి పాట సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.


కళావతి... కళావతి పాటను కింద ఇయర్ ఫోన్స్ వాడి వినండి మనసు ఆహ్లాదంగా వుంటుంది.