G-N7RFQXDVV7 ‘గంధర్వ’ తో జార్జిరెడ్డి సడన్ గా యాక్షన్ హీరోగా మారితే పరవాలేదా?

Ticker

6/recent/ticker-posts

‘గంధర్వ’ తో జార్జిరెడ్డి సడన్ గా యాక్షన్ హీరోగా మారితే పరవాలేదా?

 


'వంగవీటి, 'జార్జిరెడ్డి' ఫేమ్ సందీప్ మాధవ్ హీరోగా గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్ హీరోయిన్స్‌గా రూపొందుతున్న చిత్రం ‘గంధర్వ’. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వీర శంక‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్స్ ప‌తాకాల‌పై అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు ‘గంధర్వ’  చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ ను పరిశీలిస్తే,  ఇంతవరకు  సందీప్ మాధవ్ ‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ లాంటి రియలిస్టిక్ సినిమాల్లో నటించారు. ఆ రెండు సినిమాలు పెద్ద హిట్ అవ్వడంతో సందీప్ కు హీరోగా మంచి పేరు వచ్చింది. రియలిస్టిక్ పాత్ లో పోతున్న సందీప్ సడన్ గా యు టర్న్ తీసుకొని యాక్షన్ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. సందీప్ బాడీ లాంగ్వేజ్ రియలిస్టిక్ సినిమాలకు సరిపోయేలా వుంటుంది. మరి యాక్షన్ సినిమాలో ఎంత వరకు న్యాయం చేస్తాడో వేచి చూడాలి. అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా సందీప్ మరిన్ని సీరియస్ మూవీస్ చేసి ఆ తర్వాత యాక్షన్ సినిమాల్లో అడుగుపెట్టి వుంటే బాగుండేదని సన్నిహితులు చెబుతున్నారు.