నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన శేఖర్ కమ్ముల సినిమా ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇదే సందర్బంగా టక్ జగదీష్ సినిమాను కూడా ముందు థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ఇది ద్రుష్టిలో పెట్టుకొనే నాని ఓ ఆడియో ఫంక్షన్ లో స్టేజ్ మీద థియేటర్లంటే నాకు ప్రాణం అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. దాంతో టక్ జగదీష్ తప్పకుండా థియేటర్ లో విడుదలవుతుందని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అనుకున్నారు. కానీ ఇప్పుడు వారి ఆలోచన మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల ధరలు తగ్గించడం.. ఈస్ట్ , వెస్ట్ లో కొన్ని థియేటర్లు మూసి వుంచడం లాంటి వివరాలన్నీసేకరించి, ఓటీటీ సంస్థ ఇస్తున్న ఆఫర్ ను ద్రుష్టిలో పెట్టుకొని లాభసాటిగా వున్న ఓటీటీ వైపే మొగ్గు చూపారు. ఇంత వరకు బాగానే వుంది. అసలు విషయం ఇక్కడే వుంది. ఓటీటీలో విడుదల చేస్తే చేశారు. అది కూడా వినాయక చవితి నాడు సెప్టెంబర్ 10న స్ట్రీమింగ్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలను ఆలోచనలో పడేసింది. లవ్ స్టోరీ విడుదలైన రోజే టక్ జగదీష్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే థియేటర్ కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుందని లవ్ స్టోరీ చిత్రాన్ని థియేటర్ లో విడుదల చేస్తున్న టీమ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి టక్ జగదీష్ నిర్మాతలను డేట్ మార్చుకోమని అడిగినట్లు కూడా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. లవ్ స్టోరీ నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ ‘మా సినిమా వరకైతే పరవాలేదు. త్వరలో చిరంజీవి సినిమా, పుష్ప సినిమాలు వస్తున్నాయి. అవి కూడా ఇలాగే అయితే ఎగ్జిబిటర్లు ఎలా డబ్బులు కడతారు? ఇది మంచి సంప్రదాయం కాదు. అంటున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆ మధ్య తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఒక సమావేశం ఏర్పాటు చేసి సినిమా విడుదల విషయం గురించి మాట్లాడారు.కానీ పెద్ద స్పందన కనిపించినట్టు అనిపించలేదు. టాక్ జగదీష్ ఆల్రెడీ ఓటీటీ సంస్థతో ఒప్పందం చేసుకుంది కాబట్టి లాభాల బాటలో వుంటుంది. కానీ లవ్ స్టోరీ థియేటర్ లో విడుదలై కలెక్షన్లు రాబట్టాల్సి వుంటుంది. ఇలాంటి సమస్యలు ముందు ముందు మరిన్ని వచ్చే అవకాశం వుంది. అని విశ్లేషకులు అంటున్నారు. కానీ మరి కొంత మంది విశ్లేషకులు మాత్రం ఈ సమస్య పెద్దగా బాధించేది కాదు. ఎందుకంటే టక్ జగదీష్ చిత్రాన్ని మిడ్ నైటే విడుదల చేస్తారు. కాబట్టి టార్గెటెడ్ ఆడియన్స్ అందరూ ఉదయం 9 లోపే చూసేస్తారు. ఇంకా కొంతమంది సైకాలజీ ప్రకారం ఆలోచిస్తే మన ఇంట్లో సినిమానే కద లవ్ స్టోరీ చూసొచ్చాక చూద్దాంలే అని కూడా ఆలోచించేవాళ్లు వుండకపోరు. మన వద్ద వున్న సినిమాలను కాస్త ఆలస్యం చేసే అవకాశం కూడా వుండకపోలేదు . సినిమా బాగుంటే ఇవేవీ అడ్డంకులు కావు అనే వాళ్లు కూడా లేకపోలేదు అంటున్నారు.
Social Plugin