ఫ్యామిలీమ్యాన్ 2 ద్వారా తన నటనలో రెండో కోణాన్ని చూపిన సమంత అక్కినేని నటనకు గాను ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెల్ బోర్న్ 2021 లో బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఫిమేల్ అవార్డుకు సమంత ఎంపికైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్డిస్తూ ఐఐఎఫ్ఎమ్ టీమ్ సమంతకు అభినందనలు తెలిపారు. ఇంకా ఫ్యామిలీమ్యాన్ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన మనోజ్ బాజ్ పాయ్ కి మేల్ కేటగిరిలో అవార్డు వరించింది. ఐఎప్.ఎఫ్.ఎమ్ లో 2021కిగానూ ‘ఆకాశం నీ హద్దురా’ (తమిళ వెర్షన్) లో సూర్య అద్భుతమైన నటనను కనబరిచారని బెస్ట్ ఫెరఫార్మన్స్ మేల్ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ వెబ్ సీరిస్ గా మీర్జాపుర్ 2, ఇంకా షేర్ని, గ్రేట్ ఇండియన్ కిచెన్, లూడో, ఫైర్ ఇన్ ది మౌంటెన్స్, వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నాయి.
Social Plugin