ప్రస్తుతం మలయాళం సినిమాలపై తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల మలయాళం సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు అందించాలనే ఉద్దేశ్యంతో సినిమా రిపోర్టర్ ఈ ప్రయత్నం చేపట్టింది.
ప్రస్తుతం మలయాళంలో ‘టూ మెన్’ అనే చిత్రం బాగా ప్రాచుర్యంలో వుంది. ఇర్షాద్ అలీ, మరియు ప్రముఖ దర్శకుడు ఎం.ఎ. నిషాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కె.సతీష్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ను ఫేస్ బుక్ ద్వారా విడుదల చేశారు. పోస్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. ఇందులో ప్రముఖ దర్శకులు సిద్ధిక్, రంజిత్, ఉన్నికృష్ణన్, సురేష్ ఉన్నతన్, జీతు జోసెఫ్, మహేష్ నారాయణన్, రంజిత్ శంకర్, ప్రియానందన్, నటిస్తున్నారు. డి గ్రూప్ పతాకంపై మాన్యువల్ క్రజ్ డార్విన్ నిర్మించిన ఈ చిత్రానికి ముహాద్ వెంబయం స్క్రిప్ట్ అందించారు. సిద్ధార్థ్ రామస్వామి సినిమాటోగ్రాఫర్. ఆనంద్ మధుసూదనన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తొంభై శాతం దుబాయ్ లో చిత్రీకరించబడింది. నిజజీవితం ఆధారంగా నిర్మించిన ఈ కథ రియలిస్టిక్ గా అందరినీ ఆకట్టుకునేలా వుంటుందని దర్శకుడు సతీష్ చెప్పారు.ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - డానీ డార్విన్, డోనీ డార్విన్, ప్రొడక్షన్ డిజైనర్ - జోయెల్ జార్జ్, మేకప్ - మనోజ్ అంగమాలి, కాస్ట్యూమ్ డిజైన్ - సునీల్ రెహమాన్, ఎడిటర్, కలరిస్ట్ - శ్రీకుమార్ నాయర్, సౌండ్ డిజైన్ - రాజకృష్ణన్ MR, ఫైనాన్స్ కంట్రోలర్ - అనూప్
-వార్తా సేకరణ - AS దినేష్.
Social Plugin