చిరంజీవి అనే పేరులోనే మెస్మరిజం ఉంది . ఒక్కసారి చూస్తే అందరినీ ఆకట్టుకునే చురుకైన రూపం .
సామాన్య కుటుంబంలో పుట్టి అహర్నిశలు కష్టపడి తన స్థాయిని చిరంజీవి గారు చిత్ర రంగ ప్రవేశం చేసిన నాటికి ఏయన్నార్, ఎన్టీఆర్ ,కృష్ణ , శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు సినిమా రంగాన్ని శాసిస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు . వీరే కాకుండా మరి కొంతమంది నూతన నటీనటులు అప్పటికే చిత్ర రంగ ప్రవేశం చేసి హీరోలుగా విజయాలు సాధిస్తున్నారు. ఈ పోటీ రంగుల ప్రపంచంలో ఎంతో కష్టపడి ఎన్నో విజయాలు ,ఘన విజయాలు, అఖండ ఘన విజయాలు సాధించి శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నారు మెగాస్టార్.
చిరంజీవి హీరోగా నటించిన చిత్రాలు ఎన్నో ప్రభంజనం సృష్టించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి .చిరంజీవిగారు నటించిన చిత్రాలు విడుదల అవుతున్నాయంటే అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా ఎంతో ఆనందం కలుగుతుంది .ఫ్లాప్ టాక్ ,యావరేజ్ టాక్ వచ్చినా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి .చిరంజీవిగారు నటించిన చిత్రాలు డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శింపబడిన వివరాలను మీకు అందజేస్తున్నాం. కానీ ఇందులో . లేటుగా రిలీజ్ అయిన కేంద్రాలను ఇందులో పరిగణలోకి తీసుకోలేదు.
.మనవూరి పాండవులు 4 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
మొగుడు కావాలి 1
న్యాయం కావాలి 6
చట్టానికి కళ్లు లేవు 5 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
శుభలేఖ 2
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 2
పట్నం వచ్చిన పతివ్రతలు 1
అభిలాష 1
మగమహారాజు 4
ఖైదీ 6 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అయితే ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రంగా తెలుగు ప్రజానికం చెప్పుకుంటుంది. ఆ తర్వాత
చాలెంజ్ 1
అడవిదొంగ 1
విజేత 2
రాక్షసుడు 1
పసివాడి ప్రాణం 10 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాలో చిరంజీవి వేసిన బ్రేక్ డ్యాన్స్ కుర్రకారును ఉర్రూతలూగించింది. కేవలం బ్రేక్ డాన్స్ చూడటం కోసమే అప్పట్లో ఈ సినిమాకు యూత్ వెళ్లే వారు.
పసివాడి ప్రాణం చిత్రానికి వచ్చిన క్రేజు తర్వాత యముడికి మొగుడు చిత్రానికి విపరీతమైన క్రేజు వచ్చింది. మంచి ఓపెనింగ్స్ కూడా రాబట్టుకుంది.
యముడికి మొగుడు చిత్రం 14 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
ఖైదీ నంబర్ 786....1
త్రినేత్రుడు 1
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు 14
స్టేట్ రౌడీ 1
కొండవీటి దొంగ 6 కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రంలో శుభలేక రాసుకున్నఎదలో ఎపుడో పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది.
జగదేక వీరుడు అతిలోక సుందరి 29 కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడి చిరంజీవిని మరింత ఎత్తుకు చేర్చింది.
ఆ తర్వాత కొదమసింహం 4 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి కౌబాయ్ గా నటించారు.
గ్యాంగ్ లీడర్ 30 కేంద్రాలలో వందరోజులు ప్రదర్శించబడ్డ ఈ చిత్రం చిరంజీవి కెరీర్ ను మరో మెట్టు పైకి చేర్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్టే… ఇదే సినిమాను హిందీలో ఆజ్ కా గూండారాజ్ అనే పేరుతో తెరకెక్కించారు.
రౌడీ అల్లుడు 21 కేంద్రాలలో,
ఘరానామొగుడు39 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఘరానా మొగుడు చిత్రంలో హిట్ అయిన బంగారు కోడి పెట్ట పాటను రామ్ చరణ్ హీరోగా చేసిన మగధీరలో కూడా రీ యూజ్ చేశారు.
ఆజకా గూండారాజ్ 4
ముఠా మేస్త్రీ 17 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకున్నాయి.
మెకానిక్ అల్లుడు 2
ముగ్గురు మొనగాళ్ళు 12
అల్లుడా మజాకా! 27 కేంద్రాలలో వందరోజులు ప్రదర్శింపబడ్డాయి. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని తిరిగి నటించిన చిత్రం హిట్లర్. ఆచి తూచి కథలను ఎంచుకొని నటించిన ఈ హిట్లర్ 41 కేంద్రాలలో వందరోజులు ప్రదర్శించబడింది. ఆ తర్వాత మెగాస్టార్ నటించిన
మాస్టర్ 52 కేంద్రాలలో,
బావగారు బాగున్నారా 54 కేంద్రాలలో
చూడాలని వుంది 62 కేంద్రాలలో,
స్నేహం కోసం 45 కేంద్రాలలో వందరోజులు జరుపుకున్నాయి. ఆ తర్వాత కే. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన
ఇద్దరు మిత్రులు 18 కేంద్రాలలో,
అన్నయ్య 60 కేంద్రాలలో,
మృగరాజు 2 కేంద్రాలలో,
మంజునాథ 2 కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకున్నాయి.
డాడి 15 కేంద్రాలలో వందరోజులు ప్రదర్శింపబడగా,
ఇంద్ర 114
ఠాగూర్ 183 కేంద్రాలలో వందరోజులు ప్రదర్శింపబడ్డాయి.
అంజి 10
శంకర్ దాదా ఎంబిబిఎస్ 46
అందరివాడు 13
జైచిరంజీవ 10
స్టాలిన్ 34
ఖైదీ నెంబర్ 150.... 1 కేంద్రాలలో వందరోజులు ప్రదర్శింపబడ్డాయి.
సైరా 1 కేంద్రంలో వందరోజులు ప్రదర్శింపబ్బాయి.
ఈ సమాచారాన్ని గుంతకల్లుకు చెందిన చిరంజీవి గారి సీనియర్ అభిమాని ఇచ్చినందుకు వారికి మా హృదయపూర్వక అభినందనలు .
Social Plugin