G-N7RFQXDVV7 మలయాళం: పోర్చ్ గీసు మంత్ర విద్యతో మలయాళ చిత్రం

Ticker

6/recent/ticker-posts

మలయాళం: పోర్చ్ గీసు మంత్ర విద్యతో మలయాళ చిత్రం

 



మలయాళ సినిమా చరిత్రలో తొలిసారిగా పోర్చ్ గీసు మంత్ర విద్యపై ఓ చిత్రాన్ని శ్రీజిత్ ఫణికర్ సైకో థ్రిల్లర్ గా తెరకెక్కించారు. "ఓహ్" అనేది క్రూరమైన పోర్చుగీస్ మంత్రవిద్య,  ఇది మానవ మాంసాన్ని తిని పెరిగిన పందుల రక్తాన్ని ఉపయోగించి ఈ విద్యను ప్రదర్శిస్తారు. అత్యంత భయంకరంగా వుండే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు శ్రీజిత్ ఫణికర్ రూపొందిస్తున్నారు. లిల్లీ పాత్రలో సూర్య లక్ష్మి, ఆల్బీ పాత్రలో శ్రీజిత్ ఫణిక్కర్ నటిస్తున్నారు. ఇంకా స్మిత శశి, సంతూభాయ్,  చెర్రీ నటిస్తున్నారు.ఇందులో రెండు పాటలున్నాయి. సుమేష్ సోమసుందర్ సంగీతాన్ని అందించారు. స్వస్తిక్ వినాయక్ క్రియేషన్స్ పతాకంపై అనిలా కె.ఎమ్ నిర్మించిన ఈ చిత్రం  అత్యంత ఆసక్తిని క్రియేట్ చేసేలా వుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నిజో MJ, ఆర్ట్ - సంతుభాయ్, మేకప్ - సుజిత్ పరవూర్, కాస్ట్యూమ్ డిజైన్ - అక్షయ షణ్ముఖన్, స్టిల్స్ - మిథున్ T సురేష్,ఎడిటర్ - మజు అన్వర్,చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ - ఆదర్శ్ వేణు గోపాలన్, అసోసియేట్ డైరెక్టర్ - బనీష్ జె పుతియత్, డైరెక్టర్స్ - అను చంద్ర, గోపన్ జి, నేపథ్య సంగీతం - సుమేష్ సోమసుందరం, డ్యాన్స్ - సుజిత్ సోమసుందరం, చీఫ్ అసోసియేట్ కెమెరామెన్ - అరుణ్ టి శశి, 

                                                                                            వార్తా సేకరణ:- AS. దినేష్.