‘మా’ అసోషియేషన్ లో ఇప్పటికీ లుక లుకలు జరుగుతూనే వున్నాయి. బయటికి సద్దుమణిగినట్టే వున్నా లోపల ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు.ఈ మధ్య ప్రకాష్ రాజ్ చేసిన డబుల్ మీనింగ్ వచ్చేలా చేసిన ట్వీట్ చాలా మంది మనసుల్లో నాటుకుపోయింది. ఈ మా అసోషియేషన్ గొడవ కూడా ఆ మధ్య ‘మా అసోషియేషన్ భవనం’ చుట్టూ కూడా తిరిగింది. అయితే అసలు ఇన్ని రోజులైనా మా అసోషియేషన్ కోసం ఎందుకు బిల్డింగ్ కట్టలేకపోయిరు. బాలీవుడ్ తర్వాత ఆ రేంజ్ లో సినిమాలు తీసేది ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీనే కద మరి మన ఆర్టిస్టుల కోసం ఎందుకు బిల్డింగ్ లేదు అనేది ఆ మధ్య చర్చనీయాంశమైంది. అతి చిన్న సినిమా ఇండస్ట్రీ అయిన మలయాళం ఇండస్ట్రీ తమ సొంత డబ్బు దాదాపు పది కోట్లు వెచ్చించి సొంత భవనాన్ని కట్టుకున్నారు. అది ఫైవ్ స్టార్ ఫెసిలిటీలతో ఒక కార్పొరేట్ సంస్థలను తలదన్నేదిలా వుంది. అందులో ఎవరైనా హీరోలకు కథలు చెప్పాలంటే చక్కటి రూమ్స్, సినిమా చూడాలనుకునే వాళ్లకోసం మినీ థియేటర్, సినిమాలకు సంబంధించిన పెద్ద లైబ్రరీ, ఎన్నో ఫెసలటీలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా మలయాళం నటీనటులు తమ అమ్మ భవనాన్ని తీర్చి దిద్దుకున్నారు. మరి మన వాళ్లెందుకు? మన ఆర్టిస్టుల్లో యూనిటీ లేదా? ఎలక్షన్లప్పుడు మాత్రమే మా అసోషియేషన్ అంటూ వినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీటం లేదు ? ఏదైనా అంటే అది మా అంతరంగ విషయం అంటారు….అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు మొదలవుతున్నాయి. అంతే కాకుండా అమ్మ భవనం ఫోటోలు కూడా పోస్ట్ చేసి తెలుగు పెద్దలను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలకు ఎప్పటికైనా సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
Social Plugin