G-N7RFQXDVV7 మలయాళం: ’అభియుడ కథ అనువిందేయం‘ కోసం తెలుగు నిర్మాతల పోటీ

Ticker

6/recent/ticker-posts

మలయాళం: ’అభియుడ కథ అనువిందేయం‘ కోసం తెలుగు నిర్మాతల పోటీ

 



టొవినో థామస్, పియా బాజ్ పాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అబియుడ కథ అనువిందేయం’ చిత్రాన్ని  ఆసియాలోనే మొదటి మహిళా సినిమాటో గ్రాఫర్ గా నిలిచిన బి.ఆర్. విజయలక్ష్మి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సైనా ప్లే ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ, మలయాళంలో ఏక కాలంలో నిర్మించిన ఈ చిత్రంలో ప్రభు, రోహిణి, సుహాసిని, దీప, మనోబాల, మరియు మహేష్ నటించారు. కథ విషయానికి వస్తే...అభి మరియు అను పూర్తిగా భిన్నమైన పరిస్థితులలో జీవిస్తుంటారు..అభి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అను రెగ్యులర్ గా  పని చేసుకుంటూ  జీవనశైలి కోసం ఆమె తల్లికి చాలా దగ్గరగా వుంటూ తల్లిపై ఆధారపడుతుంది.అను ఇడుక్కి వాగామోన్‌కు చెందిన సేంద్రీయ రైతు. చురుకైన అమ్మాయి, సామాజిక సమస్యలు మరియు బాధ్యతలలో చురుకుగా పాల్గొనే స్వతంత్ర అమ్మాయి.ఫేస్‌బుక్ ద్వారా పరిచయంలో అభి, అను ఒకరినొకరు కలుసుకుని, ఆపై ఇష్టపూర్వకంగా వివాహం చేసుకుంటారు.అను గర్భవతి కావడం మరియు వారి కుటుంబాలు కలిసినప్పుడుఅభి మరియు అను సంబంధాల పునాదిని ప్రశ్నార్థకం చేసే వింత సమస్యల మధ్య జరిగిన దిగ్భ్రాంతికరమైన ట్వీస్ట్ జరుగుతుంది. దానిని అధిగమించడం వారికి కష్టం. అవుతుంది. ఆ తరువాత జరిగే సంఘటనలేంటి? అనేది చిత్రకథ..ఉదిలి ఫిల్మ్స్ పతాకంపై సరిగామా ఇండియా లిమిటెడ్ సమర్పించిన ఈ చిత్రానికి అనిలన్ సినిమాటోగ్రాఫర్.ఉదయభాను మహేశ్వరన్ స్క్రిప్ట్ రాశారు.ఎడిటర్-ఇన్-చీఫ్ సునీల్ శ్రీనాథన్, నిర్మాత-విక్రమ్ మెహ్రా, బిఆర్ విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్-సంతోష్ శివన్.

                                                                                                 

                                                                                                -వార్త సేకరణ: ఎఎస్ దినేష్.