ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప’ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. పుష్ప టీజర్ విడుదలైనప్పటి నుంచి ఫస్ట్ సింగిల్ మీద అభిమానులకు, ట్రేడ్ వర్గాలకు, విశ్లేషకులకు విపరీతమైన అంచనాలుండేవి. అంతకు మించి అన్నట్టు గా దాక్కో దాక్కో మేక అంటూ దేవిశ్రీ ప్రసాద్ మెస్మరైజ్ చేసి వాళ్ల అంచనాలను ఇంకా పెంచేశాడు. ఫస్ట్ సింగిల్ విడుదలై ఇప్పటి వరకు ఏ సౌత్ ఇండియన్ సినిమా లిరికల్ సాంగ్స్ అందుకోనంతగా 24 గంటల్లో దాదాపు పది మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకొని సినీ విశ్లేషకులు ముక్కున వేలేసుకునేట్టు చేస్తోంది. లైక్ విషయంలో కూడా దాదాపు 6.57 లైక్స్ సొంతం చేసుకొని ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. ఇప్పుడు మేము చెప్పింది కేవలం తెలుగు వెర్షన్ సాంగ్ కు మాత్రమే. ఇంకా కన్నడ, మలయాళం, తమిళం లాంటి బాషల్లో కూడా ఈ పాట విడుదలై ఒక ఊపు ఊపేస్తోంది. దాంతో అటు నార్త్, ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో తెలుగు దర్శకులంటే ఒక రకమైన గౌరవం చోటు చేసుకుంది. గతంలో తమిళ దర్శకులు శంకర్, మణిరత్నం, మురుగదాస్ అంటూ వుండేది ఇప్పుడు అందరి నోట రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, పైడిపల్లి వంశీ, కొరటాల శివ అంటూ వినిపిస్తోంది. తెలుగు సినిమా స్థాయి పెరుగుతుండటం ఒకరకంగా ఆనందంగా వుంది. తెలుగు సినిమా అంటే కేవలం కమర్షియల్ సినిమాలే అక్కడ వుంటాయి. కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు అక్కడ దొరకవు అని వున్న అపవాదును ఈ సినిమా తుడిచివేస్తుంది అనిపిస్తోంది. ఏది ఏమైనా దాక్కో దాక్కో మేక అంటూ దాక్కున్న రికార్డులను వెదికి పట్టుకుంది ఈ ఫస్ట్ సింగిల్ అని చెప్పచ్చు.
Social Plugin