G-N7RFQXDVV7 భీమ్లానాయక్ గ్లింప్ చూశాక ఏమైనా మాటలున్నాయా?

Ticker

6/recent/ticker-posts

భీమ్లానాయక్ గ్లింప్ చూశాక ఏమైనా మాటలున్నాయా?


 

పవన్ అభిమానులకు వకీల్ సాబ్ తర్వాత మరో సారి పూనకాలు వస్తున్నాయి. నిన్న పవర్ స్టార్ పంచె కట్టుకొని వున్న వెనక ఫోటో వదిలి అభిమానులు ఆసక్తి రేకెత్తించారు చిత్ర యూనిట్.  ఇప్పుడు టైటిల్ తో పాటు ఒక గ్లింప్ వదిలి అభిమానుల్లో పూనకాన్ని పెంచారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే రాస్తున్న ఈ చిత్రం మొదట్నుంచి ఆసక్తి రేకెత్తిస్తూనే వుంది. మలయాళంలో అయ్యప్పన్ కోషియుం అని ఇద్దరి పేర్లు వచ్చేలా టైటిల్ వుంటుంది కానీ పవర్ స్టార్ స్టామినాను ద్రుష్టిలో పెట్టుకొని తెలుగులో  పవర్ స్టార్ పేరు భీమ్లా నాయక్ నే టైటిల్ గా నిర్ణయించారు. వకీల్ సాబ్ విడుదలైనప్పుడు ఈ సినిమా పింక్ రీమేకే కద… పింక్ సినిమాను పవర్ స్టార్ అభిమానులు కూడా చూసి వుంటారు మరి ఇప్పుడేం వెరైటీ వుంటుంది అని సినీ విశ్లేషకులు అంచనాలు వేశారు. కానీ సినిమా విడుదలయ్యాక తీరు మారింది. వారి నోటి నుంచి మాటలు రాకుండా ఆగిపోయాయి. ఎలాంటి కథతోనైనా బాక్సాఫీసు మెడలు వంచే సత్తా వున్న హీరో పవర్ స్టార్ అంటూ విశ్లేషకులందరూ ఏక కంఠంతో ఒప్పుకున్నారు. మరి ఈ సినిమానో… అంటే…. త్రివిక్రమ్ ఒరిజినల్ కథకు పెద్ద గా మార్పులేమీ చేయకుండా కత్తుల్లాంటి డైలాగులతో ప్రేక్షకుల గుండెల్లో దించేలా వుంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్ర యూనిట్ చెబుతున్న మాటలు వినేకొద్దీ ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తి పెరుగుతూ పోతోంది. త్రివిక్రమ్ మాటలు ఏ రేంజ్ లో వుంటాయో ఇప్పుడు వదిలిన గ్లింప్ చూస్తే తెలుస్తుంది. ‘ ఏంటి చూస్తున్నావ్… కింద క్యాప్షన్ లేదనా?.. అవసరం లేదు పద.. అంటూ పవర్ స్టార్ చెప్పిన డైలాగ్ వింటేనే అర్థమవుతుంది.. ఈ చిత్రంలో మాటలకు ఎంత ప్రాముఖ్యత వుందో అవి అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటాయో…  ఇంకెందుకాలస్యం… ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని వేళ్లు లెక్క పెడుతూ కూర్చుందాం. ఏమంటారు?