మొదట్నుంచి ‘మా’ అసోషియేషన్ రాజకీయాలు ‘మా’ సొంతభవనం చుట్టే తిరుగుతున్నాయి. బండ్ల గణేష్ అయితే ఏకంగా శాస్వత భవనంతో ఇప్పుడు పనేముంది. అంతకు ముందు చెయ్యాల్సిన పనులు చాలా వున్నాయి. పేద ఆర్టిస్టులకు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది అని చెబుతుంటే మరోవైపు మంచు విష్ణు నేను మూడు చోట్ల స్థలం చూశాను. మనమంతా కూర్చొని ఏది బెటరో డిసైడ్ చేద్దాం అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. మరో వైపు నాగబాబు డబ్బు సమకూర్చచ్చు గానీ స్థలం ఎలా తెస్తాడో చెప్పాలి అంటూ సవాల్ విసిరాడు. దానికి బదులుగా విష్ణు మూడు స్థలాలను చూసినట్టు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ మాత్రం తనదైన శైలిలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎకరం స్థలం ఇవ్వాల్సిందిగా కోరతాను అని అన్నారు. ఇలా మా అసోషియేషన్ రాజకీయాలన్నీ ‘మా’ భవనం చుట్టూ తిరుగుతుంటే మూవీ ఆర్టిస్టు సర్వ సభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో మోహన్ బాబు సూటిగా కొన్ని ప్రశ్నలు సందించి సంచలనం స్ట్రుష్టించారు. గతంలో ‘మా’ అసోషియేషన్ కోసం ఒక భవనం కొని నాగబాబు హయంలో అమ్మేసిన విషయం తెలిసిందే. ఈ పాయింట్ ను పట్టుకొని మోహన్ బాబు ఎక్కువ డబ్బు ఖర్చు చేసి కొన్న ఆ భవనాన్ని తక్కువకు అమ్మేశారు. దాని మీద ఎవరైనా మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు. మా భవనం చుట్టే తిరుగుతున్న రాజకీయాలు పాత భవనం అమ్మకం వివాదం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇలా వాడి, వేడిగా సాగిన ఈ సమావేశంలో మరో వారంలో ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది వివరిస్తామని క్రిష్ణంరాజు, మురళీమోహన్ లు తెలిపారు. మిగతా సభ్యులు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని లేదంటే చాలా సమస్యలు తలెత్తే ప్రమాదం వుందని అన్నారు.
Social Plugin