G-N7RFQXDVV7 స్పెషల్ స్టోరీ: ఓటీటీ బిజినెస్ ఎప్పటికీ ఇలానే వుంటుందా?

Ticker

6/recent/ticker-posts

స్పెషల్ స్టోరీ: ఓటీటీ బిజినెస్ ఎప్పటికీ ఇలానే వుంటుందా?

 



ప్రస్తుతం అటు బాలీవుడ్ లో ఇటు దక్షిణాదిలో ఓటీటీ  సంస్థలు సరికొత్త క్రేజును సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల ‘నారప్ప’ లాంటి మెయిన్ స్ట్రీమ్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయడంతో థియేటర్లు,ఓటీటీలు అనే అంతరాలు తొలగిపోయాయి. ఓటీటీ సంస్థలు మరొక అడుగు ముందుకేసి నిర్మాతలకు వాళ్లిస్తున్న ఫ్యాన్సీ ఆఫర్స్  నిర్మాతలను డైలమాలో పడేస్తున్నాయి. అయినా నిర్మాతలు మాత్రం ఓటీటీ వైపే మొగ్గు చూపితే భవిష్యత్తులో డిస్ట్రిబ్యూషన్ ఆదాయం అటకెక్కుతుందని నిబ్బరంగా వుంటున్నారు. సినిమాలు పూర్తి చేసుకొని వున్న క్రేజున్న సినిమాల వెంట ఓటీటీలు పడుతూనే వున్నాయి. భారీ ఆఫర్లు ఇస్తూ ఊరిస్తూనే వున్నాయి.ఇప్పటికే  నాని రెండు సినిమాలకు, శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’, ఆకాష్ పూరి చిత్రం రొమాంటిక్, కేజిఎఫ్ 2 చిత్రాలకు క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. అయితే వీటిని సదరు నిర్మాతలు తిరస్కరించినట్టు తెలిసింది. కొత్తగా పుట్టగొడుగుల్లా వెలసిన  డిజిటల్ సంస్థలు తెలుగు మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి  ప్రత్యేక కారణం ఉంది. మన మార్కెట్ చాలా పెద్దది. మనం తీసే కమర్షియల్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా రీచ్ భారీగా ఉంటుంది.  దాన్ని ఒడిసి పట్టుకొని మన దర్శక, నిర్మాతలు కూడా పాన్ ఇండియా మూవీలను నిర్మించడానికి ముందుకొస్తున్నారు. బాహుబలి  తర్వాత ‘సాహో’, ‘పుష్ప’, ‘లైగర్’ అంటూ పాన్ ఇండియా సినిమాలు గా రూపొందుతున్న చిత్రాలకు ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొన్న విషయం తెలిసిందే. అందుకే బాలీవుడ్ నటులు కూడా తెలుగు సినీ ఇండస్ట్రీపై కన్నేసి తెలుగులో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.ఇక నార్త్ విషయానికి వస్తే…. బాహుబలి సినిమా నుంచి తెలుగు సినిమాకు అక్కడ ప్రత్యేకమైన క్రేజు ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన సాహో కూడా మంచి అక్కడ మంచి కలెక్షన్లే రాబట్టింది.  ఇలా అమాంతం తెలుగు సినిమాల మీద పెరిగిన క్రేజుతో  అక్కడి ప్రేక్షకులు ఈ మధ్య మన చిత్రాలను ఎగబడి చూసి వందల మిలియన్ల వ్యూస్ ని కట్టబెడుతున్నారు. ఈ లెక్కన స్టెయిట్ గా ఆన్ లైన్ రిలీజ్ చేస్తే భారీ స్థాయిలో లాభాలు సంపాదింవచ్చు అనేది వాళ్ల ఉద్దేశ్యం కావచ్చు. అందుకే వద్దంటున్నా సరే... ఆఫర్స్ ఇవ్వడం మాత్రం మానుకోవడం లేదు.  ఇప్పుడిప్పుడే థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు అనే సూచన ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ సినిమాతో నిరూపితమైంది. మరి కొన్ని నెలలు వేచి చూస్తే డిసెంబర్ నాటికి పరిస్థితులు పూర్తిగా సద్దుమునుగుతాయి.  డిసెంబర్ లో విడుదల చేస్తే థియేటర్ బిజినెస్, ఓటీటీ బిజినెస్ లు నిర్మాతలకు మంచి లాభాలు తెస్తాయనే ఆలోచనతో వున్నారు. ఇప్పుడు ఏదో టెంప్ట్ చేసే డబ్బు వస్తుంది కదాని అమ్మేసుకుంటే చేతికందే లాభాలు సన్నగిల్లుతాయి. ఇప్పటికే సినిమాలు రెడీ చేసి ఫైనాన్షియర్లకు వడ్డీలు కడుతూ ఇబ్బందుల్లో వున్న నిర్మాతలు థియేటర్ల ద్వారా వచ్చే లాభాలను వదులు కోవడానికి సిద్ధంగా లేరు.బాలీవుడ్ లో ఓటిటి ట్రెండ్ ఉధృతంగా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా గొప్ప అద్భుతాలు చేసిన దాఖలాలు పెద్దగా లేవు. వెబ్ సీరిస్ లలో మాత్రం ఫ్యామిలీమ్యాన్ 2, సన్ ఫ్లవర్, ఆర్య లాంటి వెబ్ సీరిస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఒక వైపు ఓటీటీలు టెంప్ట్ చేస్తున్నాయి. మరో వైపు థియేటర్లు ఊరిస్తున్నాయి.  ఈ సమస్యను ఓ నిర్మాతతో చర్చించినప్పుడు...ఓటీటీ వుంటుంది. థియేటర్లు కూడా వుంటాయి. థియేటర్ లో చూసిన అనుభూతి టి.వి.ల్లో చూస్తే వుండదు. ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న సినిమాల్లాంటి వాటిని థియేటర్లలో  చూడటానికి ప్రేక్షకుడు ఇష్టపడతాడు.  ప్రేక్షకుల మధ్య ఒక క్రేజీ షోను చూసినప్పుడు ఆ అనుభూతి వేరుగా వుంటుంది. ఇంట్లో ఒక్కరే కూర్చొని చూస్తే ఆ అనుభూతి చప్పగా వుంటుంది. అన్నారు.  ప్రస్తుతం ఓటీటీ ఇస్తున్న ఆపర్ల గురించి మాట్లాడినప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆ ఆఫర్లు ఇస్తున్నారు. ఓటీటీ యాప్స్ పెరిగే కొద్దీ వాళ్లు కూడా ఆఫర్లు తగ్గిస్తారు. ఇప్పటికే అమెజాన్ లాంటి యాప్స్ లో  సినిమాను ఎన్ని గంటలు చూశారు అనే దాని మీద షేరింగ్ బేసిస్ లో బిజినెస్ జరుగుతోంది. మిగతా ఛానెల్స్ విషయంలో కూడా ఇదే వుంటుంది. క్రేజున్న సినిమాకు డబ్బు వుంటుంది. లేకపోతే షేరింగ్ మీద వెళ్లాల్సి వుంటుంది. ఇదంతా డిమాండ్ సప్లై సూత్రం మీద ఆదారపడి వుంటుంది అన్నారు. ఏది ఏమైనా మన జీవితాల్లో వున్న బిజీ షెడ్యూల్ లో వినోదం చాలా అవసరం. ఈ అవసరాన్ని బట్టి చూస్తే  భవిష్యత్తులో  మంచి సినిమాకు మంచి రోజులొచ్చే అవకాశం కనిపిస్తోంది.