G-N7RFQXDVV7 వామ్మో... అనుకున్నంతా అయ్యింది... బండ్ల గణేష్ హీరోఅయ్యాడు

Ticker

6/recent/ticker-posts

వామ్మో... అనుకున్నంతా అయ్యింది... బండ్ల గణేష్ హీరోఅయ్యాడు

 



బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇంతకాలం కమెడియన్ గా స్క్రీన్ మీద కనిపించిన బండ్ల గణేష్ హీరోగా కనిపిస్తున్నాడనే వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన వెంకట్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  తమిళంలో పార్తీబన్ హీరోగా నటించడిన ‘ఒత్త సెరుప్పు సైజు 7’ కి రీమేక్ గా ఇది రూపొందుతోంది. ఇదే చిత్రాన్ని అభిషేక్ బచ్చన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. తెలుగులో అదే పాత్రను బండ్ల గణేష్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది ’ అని నిర్మాత స్వాతి చంద్ర చెప్పారు. 'ఒత్తు సెరుప్పు సైజ్ 7 సినిమా కుగానూ పార్తీబన్ కు జాతీయ పురస్కారంతో పాటు, స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా లభించింది. అంతేకాకుండా ఈ సినిమాకు పలు పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రానికి అరుణ్ దేవినేని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు అని దర్శకుడు చెప్పారు.